ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలి

Thu,July 18, 2019 04:00 AM

కేటిదొడ్డి (ధరూర్): మొక్కలతోనే ప్రకృతి ప్రశాంతంగా ఉండి మనకు లాభానిస్తుందని కలెక్టర్ శశాంక అన్నా రు. ధరూర్ మండలంలోని మన్నాపురంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅథితిగా హాజరై మాట్లాడుతూ ఇంటింటికీ మొక్కలు నాటి పచ్చదనం తెవాలని సూచించారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని ప్రతిఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, ఈ కార్యక్రమం జరిగినన్ని రోజులు మొక్కలు నాటి వాటితో ఫొటోదిగి ఉరుకుండ కూడదన్నారు. ఎం దుకంటే ఇప్పటికే భూమిపై సరైన చెట్లులేక రైతులతో పాటు మ న ందరం చాలా ఇబ్బందులు పడుతున్నామని అధికారులతో అన్నారు. అధికారులకు గ్రామస్తులందరూ సహకరించి మొక్కలు నాటాలని, ఈ రోజు మొక్కలు నాటితేనే ముందుముందు అవి చెట్లుగా మారుతాయ ని, అప్పుడు ప్రకృతి చాలా అందంగా ఉంటుందన్నారు. వ ర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు మంచి దిగుబడులతో వస్తాయన్నారు. ఈ రోజు నాటే మొక్కలు భవిష్యత్ తరాలకు వరంగా మారుతాయని తెలిపారు. ప్రతి వ్యక్తి మొక్కలు నాటి వాటిని రక్షించాలని సూచించారు.

మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలి:జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి
గ్రామాల్లో ఉన్న ప్రజలు మొక్కలు చాలా వరకు నాటుతున్నారని కానీ అవి సంరక్షించకుండా చాలా తెలిగ్గా తీసుకుంటారని అది మంచి పద్ధతి కాదని ధరూర్ జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ప్రతివ్యక్తి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తేనే మాత్రం తెలంగాణ హరితరాష్ట్రం గా మిగిలిపోతుందన్నారు. సీఎం కేసీఆర్ మనకిచ్చిన గొప్పఅవకాశం మొక్కలు నాటడమేనని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో, డీఆర్‌డీవో జ్యోతి డీఈ వో సుశీంధ్రరావు, ఎంపీపీ నజుమున్నీ సా బేగం, సర్పంచ్ మహబూబ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles