ప్రభుత్వ భూమి కబ్జాకు కుట్ర

Sun,July 14, 2019 01:01 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : గద్వాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే అను చరులు గోన్‌పాడ్ గ్రామ సమీపంలోని కస్తూర్బా పాఠశాల ముందు ఉన్న ప్రభుత్వ భూమి ని కబ్జా చేయడంలో భాగంగా, ప్రభుత్వ భూమిని తన అనుచరులతో చదును చే యిస్తుండగా గోన్‌పాడ్ సర్పంచ్ మజీద్ తన అనుచరులతో కలిసి అడ్డుకున్న సం ఘటన శనివారం గోన్‌పాడ్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. సర్పంచ్ మజీ ద్ తెలిపిన వివరాలు ప్రకారం గతంలో స ర్వేనంబర్ 44లో 5 ఎకరాల భూమి ఫ్రీడం ఫైటర్ కోటాలో ప్రమీలాబాయికి 2011లో స్థలం కేటాయించారన్నారు. అ యితే గతంలో మంత్రిగా పనిచేసిన ప్రస్తు త మాజీ ఎమ్మెల్యే హోదాలో ఆ సర్వే నంబర్‌లో కస్తూర్బా పాఠశాలతో పాటు, పాలిటెక్నిక్ కళాశాలకు స్థలం కేటాయించ గా అందులో నిర్మాణాలు జరిగి ప్రస్తుతం అక్కడ కళాశాల, కస్తూర్భా విద్యాల యా లు నడుస్తున్నాయని చెప్పారు. అయితే 2012 నుంచి ఇప్పటి వరకు ఆ భూమి ఎ వరి ఆధీనంలో లేకపోవడంతో దానిని రెవెన్యూ అధికారులు స్వా ధీనం చేసుకున్నట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం గద్వాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే కస్తూర్బా పాఠశాలకు ఎదురుగా ఉన్నా సర్వేనంబర్ 80లో ఫ్రీడం ఫైటర్‌కు స్థలం కేటాయించారని ఆ స్థలాన్ని ఫ్రీడం ఫైటర్ కుటుం బం తనను చదును చేయించమని చెప్పిందని అందువల్ల ఆ భూమిని చదును చే యిస్తున్నానన్నారు.అయితే సదరు భూమి ఫ్రీడం ఫైటర్ పేరు మీద లేదని రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదైందని మజీద్ చెప్పారు.

ప్రభుత్వ భూమిని ఎలా చదు ను చేస్తారని అక్కడి వాహనాలను సర్పంచ్‌తో పాటు ఆయన అనుచరులు అడ్డుకున్నారు. కోట్ల విలువ చేసే భూమిని ఫ్రీడం ఫైటర్‌కు కేటాయించడం ఏమిటని వారికి కేటాయించాలంటే జిల్లాలో భూములు చాలా ఉన్నాయని అక్కడ కేటాయించాల ని మజీద్ సూచించారు. ఇక్కడ ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేయడానికి తమ ఎమ్మెల్యే ప్రయ త్నిస్తున్నారన్నారు. తాను ప్రభుత్వ భూమిని చదును చేసే వాహనాలను అడ్డుకోవడానికి వెళ్లితే మాజీ ఎమ్మెల్యేతో పాటు అతని అనుచరులు అంతు చూస్తామని బెదిరించారన్నారు. ఈ విషయం పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారన్నారు. రికార్డులో ప్రభుత్వ భూమిగా ఉందని ఆ భూమి పైకి ఇరు వర్గాలు ఎవరూ వెళ్ల వద్దని వారు సూచించడంతో అక్కడి నుండి ఇరు వర్గాలు వెళ్లి పోయారు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాలని సర్పంచ్ మజీద్ రెవెన్యూ అధికారులను డిమాండ్ చేశారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles