పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా చేస్తున్నాం

Sat,July 13, 2019 04:18 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : గత పాలకులు ప్రాజెక్టులు పెండింగ్ పెడితే టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రన్నింగ్ ప్రాజెక్టులు చేశామని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. శుక్రవారం పట్టణ కేంద్రంలోని అప్పన్నపల్లి సమీపంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి పాలమూరు-రంగారెడ్డి ద్వారా నీరందించేందుకు రూపొందించిన రూట్ మ్యాప్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల లో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. పా లమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రా ష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారన్నా రు. కొంత మంది ప్రాజెక్టులను అడ్డుకునేందుకు చిల్ల ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రాజకీయాలు చేయడం మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. గతంలో మహబూబ్‌నగర్ నుంచి వ లసలు వెళ్లే వారిని ప్రాజెక్టులు పూర్తయితే ధనవంతమైన జిల్లాగా ఉంటుందన్నారు. 70 ఏళ్లలో చేయని అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూయించామన్నారు. మ హబూబ్‌నగర్ మధ్య నుంచి హన్వాడ వరకు ప్రాజెక్టు కాలువను తీసుకెళ్తే పట్టణానికి ప్రత్యేక ఆకర్షణ ఉంటుందన్నారు. ఎన్నివేల కోట్లయి నా ప్రాజెక్టును పూ ర్తి చేస్తామని, అడ్డుకునే వారు త గిన బుద్ది చెబుతామన్నారు. గత పా లకులు మహబూబ్‌నగర్‌కు కృష్ణా నీళ్లు రావన్నారు. మేము అధికారంలోకి వచ్చి మిషన్ భగీరథ ద్వారా శు ద్ధ జలాన్ని అందిస్తున్నామన్నారు. గోదావరి నీళ్లు సైతం మలుపుతున్నామని గుర్తు చేశారు. కార్యక్రమం లో ఇరిగేషన్ అధికారులు, గ్రంథాలయ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆంజనేయులు, మాజీ చైర్మన్ రాజేష్, కౌన్సిలర్ శివశంకర్, నాయకులు నాగేష్ పాల్గొన్నారు.

ఎత్తిపోతలతో ప్రతి చెరువునూ నింపుతాం
హన్వాడ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథ కం నుంచి కాలువల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మండలంలోని ప్రతి కుంట, చెరువును నింపుతామని ఎక్సై జ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవా రం మండలంలోని నాయినోనిపల్లి గ్రామం సమీపంలో అప్పన్నపల్లి నుంచి నాయినోనిపల్లి వరకు సొ రంగం రావడంతో అట్టి మ్యాపును మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇంజనీర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరివేన నుంచి హన్వాడకు ఒక్క కాలు వ, ఉందడాపురం నుంచి మరో కాలువ ద్వారా నీళ్లు వస్తాయన్నారు. కరివేన నుంచి అప్పన్నపల్లి వరకు కలువ ద్వారా నీళ్లు వస్తాయి. అక్కడి నుంచి సొరంగం ద్వారా నుంచి నాయినోనిపల్లి గ్రామం వరకు సొరం గం ద్వారా నీళ్లు వస్తాయన్నారు. అనంతరం మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలతో మాట్లాడారు. వారి వెంట ఎంపీపీ బాల్‌రాజ్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మయ్య, కృష్ణయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ నరెందర్, ఎంపీటీసీ చెన్నయ్య, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ అనంతరెడ్డి,కరుణాకర్‌గౌడ్, జంబులయ్య, నాగన్న, సత్యం, శ్రీనివాసులు, రామణారెడ్డి, బసిరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles