స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్‌లోకి..

Thu,July 11, 2019 01:39 AM

అయిజ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటున్నారని, పా ర్టీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్, సభ్యత్వ నమోదు జిల్లా ఇన్‌చార్జి లింగంపల్లి కిషన్‌రావు అన్నారు. బుధవారం అయిజ మున్సిపాలిటీలోని దుర్గానగర్‌లో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా కార్యకర్తలకు పార్టీ సభ్యత్వాలను అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహంతో కలిసి అందజేశారు. ఈ సందర్భం గా కిషన్‌రావు మాట్లాడుతూ గడిచిన నాలుగున్నరేళ్లలో సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ఎంతగానో ఆకట్టుకున్నాయన్నారు. ఇంటింటికీ తాగునీరు అందించేందుకు బృహత్తర పథకాన్ని అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. బస్తీల్లో పర్యటించి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుని, వారి సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు.

గులాబీ పార్టీపై ప్రజలకు నమ్మకం కలిగింది : ఎమ్మెల్యే అబ్రహం
రాష్ట్రంలో గులాబీ పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం కలగడంతో అసెంబ్లీ ఎన్నికల్లో 44 వేల మెజార్టీని అందించారని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీపై ప్రజలు ఎనలేని ఆదరణ చూపుతున్నారన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి భారీ మెజార్టీని అందించి సంపూర్ణ సహకారం అందించాలన్నారు. పట్టణంలో పార్టీ సభ్యత్వాలను ఉద్యమంలా చేపట్టాలన్నారు. అలంపూర్ నియోజకవర్గంలో 60 వేల సభ్యత్వాలను చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా క్రియాశీలక సభ్యత్వాలను భారీ స్థాయిలో చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. దుర్గానగర్ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ..
పట్టణంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నౌరోజీక్యాంపు సర్పంచ్ భద్రయ్యకు రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, ఎమ్మెల్యే అబ్రహంలు టీఆర్‌ఎస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని అందజేశారు. గ్రామంలో భారీగా సభ్యత్వాలను చేసి ప్రశంసలు పొందాలని సర్పంచ్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, టీఆర్‌ఎస్ నాయకులు నరసింహారెడ్డి, కిశోర్, లక్ష్మన్న, తాజా మాజీ కౌన్సిలర్లు మురళి, రమేష్, టీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles