జిల్లా కేంద్రంలో 350 పడకల దవాఖాన

Thu,July 11, 2019 01:38 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : జిల్లాలో ప్రస్తుతం ఉన్న జిల్లా దవాఖానను 350 పడకలకు మార్చి నవీకరణ చేసేందుకు సరైనా ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించాలని కలెక్టర్ శశాంక రాష్ట్ర వైద్య మౌలిక వసతుల కల్పన అధికారులు, తాసిల్దార్‌ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో పాటు రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఇంజినీర్లు కలెక్టర్‌ను కలిశారు. అంతకు ముందు ఎమ్మెల్యే జిల్లాలో సూపర్‌స్పెషాలిటీ దవాఖాన నిర్మాణం కోసం రాష్ట్ర వైద్య అధికారులతో కలిసి పరుమాల శివారు, వజ్రాలగుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం, ప్రస్తుతం జిల్లా దవాఖాన ఆవరణలో ఉన్న 9 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. జిల్లా లో రాబోయే 30 సంవత్సరాలను దృష్టిలో ఉంచుకుని 350 పడకల ప్రభుత్వ జిల్లా సూపర్ స్పెషాలిటీ దవాఖానను విశాల స్థలంలో నిర్మించాలని, అందరికి అందుబాటులో ఉండే చోట ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సూచించారు. సూపర్ స్పెషాలిటీ దవాఖానలో రాబో యే కాలంలో వైద్య కళాశాల, డాక్టర్లకు గృహ సముదాయం, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు సువిశాల ప్రదేశం, రోడ్డు సౌకర్యం ఉన్న స్థలం ఎంపిక చేసుకోవాలని కోరారు. పరుమాల వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం అన్ని విధాలా బాగుంటుందని తన అభిప్రాయంగా ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. అం దుకు స్పందించిన కలెక్టర్ పరుమాల వద్ద ఉ న్న స్థలం మొత్తం ఎన్ని ఎకరాలు అందుబాటులో ఉంది, అక్క డి స్థలంపై ఏమైనా అభ్యంతరాలు, సమస్యలు ఉన్నాయా? అనే విషయాలు ఆలోచించి స్థలం ఎంపిక చేయాలని సూచించారు. అక్కడ రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చిన స్థలం, మిగిలిన స్థలం ఎంత ఉంది, అందులో రోడ్డు సౌకర్యం అన్ని విధాలుగా చూసి లే అవుట్ తయారు చేయించాలని తాసిల్దార్ జ్యోతిని ఆదేశించారు. స్థల పరిశీలన చేసిన వారిలో రాష్ట్ర మెడికల్ డిపార్ట్‌మెంట్ ఎస్‌ఈ సురేందర్‌రెడ్డి, ఈఈ విఠల్‌రావు, డీఈ శ్రీనివాస్‌రావు, తాసిల్దార్ జ్యోతి, ఎంపీపీ ప్రతాప్‌గౌడు, జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్ కేశవ్, మాజీ ఎంపీపీ సుభాన్, నేతలు మోహన్‌రెడ్డి, క్రాంతి ఉన్నారు.

గ్రంథాలయ నిర్మాణానికి స్థల పరిశీలన
జిల్లా కేంద్రంలో నూతనంగా సుమారు రూ.2 కోట్లతో నిర్మించే గ్రంథాలయానికి బుధవారం కలెక్టర్ శశాంక, ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి జిల్లా కేంద్రంలో స్థ లపరిశీలన చేశారు. మొదట కలెక్టర్, ఎమ్మె ల్యే ప్రస్తుతం పాతబస్‌స్టాండ్‌లోని పురపాలక సంఘ కాంప్లెక్స్‌లో ఉన్న గ్రంథాలయాన్ని కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. గ్రంథాలయంలో ఉన్న వసతులు, అందుబాటులో ఉన్న పుస్తకాల గురించి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బీఎస్ కేశవ్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ భవనం ఇరుకుగా ఉండడంతో ఇక్కడ పత్రికలు చదవడానికి వచ్చే పాఠకులు ఇబ్బందులకు గురవుతున్నారని కలెక్టర్‌కు వివరించారు. గ్రంథాలయ భవనాన్ని ఇక్కడ నుం చి కేఎల్‌ఐలో ఉన్న టౌన్ పోలీస్‌స్టేషన్‌కు మార్చితే అం దరికి బాగుంటుందని బీఎస్ కేశవ్ చెప్పడంతో కలెక్టర్, ఎమ్మెల్యే కేఎల్‌ఐలో ఏర్పాటు చేసిన పట్టణ పోలీస్‌స్టేషన్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం నూతన భవన నిర్మాణం కోసం ఎంపీడీవో కార్యాలయ సమీపంలో పీఆర్ కార్యాలయం వద్ద ఉన్న స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ నూతన గ్రంథాలయ భవనం నిర్మిస్తే అందరికి అందుబాటులో ఉంటుందని కలెక్టర్ సూచించారు. ఇక్కడే సిరిసిల్లా తరహాలో గ్రంథాలయ భవనం నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఎమ్మెల్యే తో పాటు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌కు కలెక్టర్ సూచించారు. అంతకుముందు కలెక్టర్ జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలను పరిశీలించడంతో పాటు విజిటర్ రిజిస్టర్‌లో సంతకం చేశారు. వారివెంట ఎంపీపీ ప్రతాప్‌గౌడ్, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ సుభాన్ నేతలు మోహన్‌రెడ్డి, మురళి, గ్రంథాలయ అధికారులు మనోజ్‌కుమార్, రామాంజనేయులు పాల్గొన్నారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles