పట్టణ ఓటర్లు 97,373 మంది

Thu,July 11, 2019 01:38 AM

జోగుళాంబ గద్వాల నమస్తే తెలంగాణ ప్రతినిధి : బల్దియా ఎన్నికలు నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగా కార్యక్రమాలు చేపడుతోంది. ముందుగా ప్రకటించిన ప్రణాళిక ప్రకారం బుధవారం ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేశారు. గద్వాల, అయిజ, అలంపూర్, వడ్డేపల్లి మున్సిపాలిటీల్లో మొత్తం ఓటర్లు, పురుషులు, స్త్రీలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీల వివరాలను వెల్లడించారు. నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఓటర్ల జాబితా ఆధారంగా మున్సిపల్ వార్డుల్లో, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రిజర్వేషన్లను కేటాయించనున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ప్రక్రియను ఎన్నికల అధికారులు చేపట్టారు. పురపోరు నిర్వహించే పట్టణాలకు సంబంధించిన ఓటర్ల వివరాలు సమగ్రంగా ప్రకటించారు. ఈ ఓటర్ల ఆధారంగానే ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీల్లో వార్డుల్లో ఏఏ వార్డుల్లో ఎన్ని పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలనే అంశాలను నిర్ణయించనున్నారు. ప్రతి వార్డులోని ఓటర్ల కేటగిరిల ఆధారంగా ఆయా వార్డుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. గద్వాల మున్సిపాలిటీలో 1510 మందికి ఒక వార్డును కేటాయింగా మొత్తం 37 వార్డులు నిర్ణయించారు. ఇక అయిజ, అలంపూర్, వడేపల్లిలో 910 మంది ఓటర్లకు ఒక వార్డును కేటాయించారు. దీంతో అయిజలో 20 వార్డులు, అలంపూర్‌లో 10 వార్డులు, వడ్డేపల్లిలో 10 వార్డులు ఏర్పడ్డాయి. తాజాగా ఎన్నికల అధికారులు ప్రకటించిన ఓటర్ల ముసాయిదా జాబితా ఆధారంగా మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్‌ను కూడా నిర్ణయించనున్నారు.

గద్వాలలో 58,087 మంది ఓటర్లు
గద్వాల మున్సిపాలిటీల్లో మొత్తం 58,087 మంది ఓటర్లున్నారు. వారిలో పురుషులు 28,724 మంది, స్త్రీలు 29,361 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో కేటగిరిల వారీగా ఎస్టీ ఓటర్లు 614 మంది ఉండగా, వారిలో పురుషులు 314 మంది, స్త్రీలు 300మంది ఓటర్లున్నారు. ఎస్సీ ఓటర్లు మొత్తం 5,998 మంది ఉండగా, వారిలో పురుషులు 2,947 మంది, స్త్రీలు 3051 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 45,255 మంది ఉండగా, వారిలో పురుషులు 22,333 మంది, స్త్రీలు 22,922 మంది ఉన్నారు. ఇతరుల 6,218 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 3,130, స్త్రీలు 3,088 మంది ఉన్నారు. గద్వాల పట్టణంలో ఓటర్ల జాబితాలో మహిళల ఓటర్లు ఎక్కువగా 29,631 మంది ఉన్నారు. మొత్తం జనాభాలో అన్ని కేటగిరిల ఓటర్లతో పోల్చుకుంటే జిల్లా కేంద్రంలో బీసీ ఓటర్లు మొత్తం 45,255 మంది ఉన్నారు. గతంలో గద్వాల మున్సిపాలిటీ జనరల్ మహిళకు కేటాయించగా, ప్రస్తుత ఓటర్ల జాబితా ఆధారంగా గద్వాల మున్సిపాలిటీ చైర్మన్‌ను బీసీకి కేటాయించే అవకాశాలున్నాయి.

అలంపూర్‌లో 9,113 మంది ఓటర్లు
అలంపూర్ మున్సిపాలిటీల్లో మొత్తం 9,113 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 4,528 మంది, స్త్రీలు 4,584 మంది ఓటర్లున్నారు. వారిలో కేటగిరిల వారీగా ఎస్టీ ఓటర్లు 28 మంది ఉండగా, వారిలో పురుషులు 13మంది, స్త్రీలు 15 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు మొత్తం 2,522 మంది ఉండగా, వారిలో పురుషులు 1208 మంది, స్త్రీలు 1314 మంది ఉన్నారు. బీసీ ఓటర్లు 5893 మంది ఉండగా, వారిలో పురుషులు 2,967 మంది, స్త్రీలు 2,925 మంది ఉన్నారు. ఇతరుల 670 మంది ఓటర్లు ఉండగా, వారిలో పురుషులు 340, స్త్రీలు 330 మంది ఉన్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్లే అధికంగా 4,584 మంది ఉన్నారు. అలంపూర్ పట్టణంలో అన్ని కేటగిరిల్లో పోల్చితే బీసీ ఓటర్లే అధికంగా 5,893 మంది ఉన్నారు. ఈ మున్సిపాలిటీ జనరల్ అయ్యే అవకాశాలున్నట్టుగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

అయిజలో 20,637 మంది ఓటర్లు
అయిజ మున్సిపాలిటీల్లో మొత్తం 20,637 మంది ఓటర్లుండగా, వారిలో పురుషులు 10,200 మంది, స్త్రీలు 10,437మంది ఉన్నారు. కేటగిరిల వారీగా ఎస్టీ ఓటర్లు 98, ఎస్సీ ఓటర్లు మొత్తం 4,883 మంది, బీసీ ఓటర్లు 14,606 మంది, ఇతరుల 1,050 మంది ఓటర్లు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. అయిజ మున్సిపాలిటీ గతంలో ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో ఈ స్థానాన్ని టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ సారి కూడా అయిజ మున్సిపాలిటీ ఎస్సీ కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles