సోమశిలకు సొగబులు

Tue,July 9, 2019 01:48 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: తెలంగాణలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రంగా కొల్లాపూర్ ప్రాంతం శోభిల్లుతుంది. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని సోమశిల, సింగవట్నంలో కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. యాత్రికులు సందర్శిస్తున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన శక్తివంచన లేకుండా పర్యాటరంగ అభివృద్ధికి కావాల్సిన నిధులను మంజూరు చేయించారు. ఇదే కోవలో ప్రస్తుత కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కూడా పర్యాటకరంగ అభివృద్ధికి ఏకో టూరిజం ద్వారా కొల్లాపూర్ నల్లమల కృష్ణానది పరివాహక ప్రాంతమైన అమరగిరి, మల్లయ్యశిల, సీమలతిప్ప, సోమశిల కేంద్రాలను లక్నారం టూరిజం కేంద్రానికి ధీటుగా మరింత అభివృద్ధి చేసేందుకు సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు రూపొందించే దిశగా చర్యలు తీసుకున్నారు. చుట్టూ ఎత్తయినా కొండలు.. పక్షుల కిలకిలరావాలతో.. నల్లమల సోయగాలతో.. కృష్ణమ్మ పరవళ్లతో.. ఎటు చూసినా పచ్చదనంతో కొండలు అలుముకొని ఆహ్లాదంగా కనువిందుచేస్తున్న అందాల దృశ్యాలు సోమశిలకు సొంతం. పాపికొండలకు ధీటుగా సోమశిలలో చూడదగ్గ ఎన్నో ప్రదేశాలు.. వనరులున్నాయి. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యానికి గురైనా.. తెలంగాణ స్వరాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో సోమశిల పర్యాటకరంగంగా ఎంతో అభివృద్ధి చెంది పాపికొండలకు ధీటుగా రూపుదిద్దుకుంది. కృష్ణానది తీరంలోని సోమశిలలో రూ.6.90కోట్ల వ్యయంతో ఆధునికహంగులతో 10 కాటేజీల నిర్మాణాలు పూర్తయ్యాయి. కొల్లాపూర్ మండలం సింగవట్నంలో కూడా పర్యాటకంగా రూ.7.84కోట్లతో పర్యాటక పనులు పూర్తై పర్యాటకులను హృదయాలను దోచుకుంటున్నాయి.

ఈ రెండు పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులు మంజూరుచేయించి పనులను పూర్తిచేయించడంలో మాజీమంత్రి జూపల్లికృష్ణారావు చొరవ ఎంతో ఉంది. తాను కూడా తీసిపోనంటూ ఎమ్మెల్యే బీరం పర్యాటకరంగం అభివృద్ధి చేసేందుకు కొల్లాపూర్ నల్లమల కృష్ణానది పరివాహక ప్రాంతం లో రెండు రోజుల క్రితం సంబంధిత అధికారులతో కలిసి పర్యటించిన విషయం విధితమే. ఈ నెల 6న పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి రాష్ట్ర సచివాలయంలో కొల్లాపూర్ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చేసేందుకు కావాల్సిన ప్రతిపాదనలను సిద్దం చేయాల్సిందిగా మంత్రి సం బంధిత అధికారులను ఆదేశించారు. సోమశిల, సింగవట్నం పర్యాటక ప్రాంతాలకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని గుం టూరు, ప్రకాశం జిల్లాల నుంచి ప్రత్యేక బస్సు ల్లో రెండేళ్లుగా పర్యాటకులు వస్తున్నారు. సోమశిలలో నిర్మించిన టూరిజం హోటల్‌లో యాత్రికు లు బస చేస్తున్నారు. ప్రస్తుతం యాత్రికులకు ఎ లాంటి ఇబ్బందులు లేకుండా అన్ని హంగులతో కాటేజీలు, రెస్టారెంట్లను నిర్మించారు. నదిలో తగినంతగా నీరు ఉంటే సోమశిల నుంచి శ్రీశై లం వరకు నది పొడవునా సోమేశ్వర లాంచీలో విహరించి నల్లమల అందాలను తనవితీర విక్షీస్తారు. జీవితంలో మరుపురాని ఘట్టం.

నిధుల మంజూరు ఇలా..
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 2016 డిసెంబర్ 10న స్వదేశీ దర్శన్ కింద కేంద్ర మంత్రిత్వశాఖ ద్వారా పర్యాటక అభివృద్ధికి నిధులు రాబట్టి సఫలీకృతులయ్యారు. సోమశిల కృష్ణానది తీరంలో పర్యాటక అభివృద్ధికి రూ.16.27కోట్ల నిధులు మంజూరయ్యాయి. రూ.6.90కోట్లతో ఆధునిక హంగులతో 10 కాటేజీలు, మరో రూ.9.37కోట్లతో కృష్ణానదిలో యాత్రికులు విహరించేందుకు వీలుగా మూడు జెట్టి పడవలను తీసుకొచ్చారు. వీటికంటే ముందుగానే రెండేళ్ల క్రితం ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.3కోట్ల వ్యయంతో సోమేశ్వరలాంచీని సోమశిల నదిలో యాత్రికులు విహరించేందుకు వినియోగంలోకి తీసుకొచ్చారు. సోమశిలలోని వీఐపీ పుష్కరఘాట్‌కు వెళ్లే రహదారి పక్కన ఐదెకరాల విస్తీర్ణంలో శ్రీకో కంపెనీ వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 10 కాటేజీల నిర్మాణాలను పూర్తిచేశారు. కాటేజీలను ఎల్‌జీఎఫ్ స్టీల్ రేకులతో అందంగా కాటేజీలను నిర్మించారు. కాటేజీల విడిది గదులకు వెళ్లే మార్గంలో సిమెంట్ ప్లేట్స్‌తో పుట్‌పాత్‌లను ఏర్పాటు చేశారు. అంతేకాదు కాటేజీల పొడవునా సోలార్ లైట్లు, వాటి పక్కనే రెస్టారెంట్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. కాటేజీల పక్కనే స్విమింగ్‌ఫూల్, రెస్టారెంట్‌లో బుకింగ్ కౌంటర్ గదిని పర్యాటకులకు అందుబాటులో ఉండేలా ప్రత్యేక గదిని నిర్మించారు. పర్యాటకంగా సోమశిల కృష్ణానది తీరంలో అద్భుతంగా కట్టడాల నిర్మాణాలతో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

పర్యాటక కేంద్రంగా సింగవట్నం
కొల్లాపూర్ మండలం సింగవట్నం పర్యాటక అభివృద్ధికి రూ.7.84కోట్లు మంజూరుకాగా ఇక్కడ 6 కాటేజీలు, రెస్టారెంట్ల నిర్మాణం పూర్తయింది. శ్రీవారిసముద్రం చెరువుగట్టు పొడవునా ఒక వైపులో సేప్టీ కోసం గ్రిల్స్, అంతే పొడవునా ఫుట్‌పాత్‌పై సిమెంట్ ప్లేట్స్ మధ్య మధ్యన పూలకుండీలు అందులో పచ్చని పూల మొక్కలు యాత్రికుల మనుసు దోచేస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడి శ్రీవారిసముద్రంలో ఎల్లప్పుడూ పుష్కలంగా కృష్ణానది నీటితో కళకళలాడుతుండడంతో పర్యాటకులు నీటిలో విహరించేందు కూడా రూ.3కోట్లతో జెట్టి పడవను తీసుకొచ్చారు. ఇక్కడే చెరువుగట్టు పైన ఓపెన్ థియేటర్ నిర్మించారు. ఈ రెండు చోట్ల ఎంతో అద్భుతంగా పర్యాటక నిర్మాణాలను కట్టడంతో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
పర్యాటక అభివృద్ధికి కృషి
దక్షిణ తెలంగాణలోనే కొల్లాపూర్ ప్రాంతం లో అతి పెద్ద టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు నావంతు కృషిచేస్తున్నాను. సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహకారంతో నల్లమల తీరంలోని అమరగిరి, చీమలతిప్పతోపాటు సోమశిల, జటప్రోలు, సింగవట్నం ఆలయాలను పరిగణలోకి తీసుకొని పర్యాటకులకు కావాల్సిన కాటేజీల ఏర్పాట్లకు ప్రతిపాదనల తయారు చేసేందుకు సంబంధిత అధికారులు ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్‌గౌడ్ టూరిజం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరకు, కేరళ పర్యాటక ప్రాంతాలకు దీటుగా నల్లమల అడవిలో చూడదగ్గ కృష్ణమ్మ పరవళ్లు ఎన్నెన్నో ఉన్నాయి. ఇక్కడి అద్భుత ప్రదేశాలు బాహ్యప్రపంచానికి కృష్ణా పుష్కారాల సందర్భంగా వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే చేరుకుంటారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానన్న నమ్మకం ఉంది.
- బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, కొల్లాపూర్

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles