ఎన్నికల ఏర్పాట్లు ముమ్మరం

Tue,July 9, 2019 01:46 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : మున్సిపల్ ఎన్నికల ఏ ర్పాట్లను అధికారులు ముమ్మరం చేశారు. ఎన్నికలు ఎప్పు డు వచ్చినా సమర్థవంతగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్ర చురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనెల 10న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటిస్తారు. 14న వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. రిజర్వేషన్లకు సంబంధించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. మహబూబ్‌నగర్ పురపాలిక సంఘంలో మొత్తం 41 వార్డులు, 194 పోలింగ్ బూత్‌లు గతంలో ఉండగా, ప్ర స్తుతం వార్డుల సంఖ్య 49కి చేరింది. దీంతో కొత్తగా 60కిపై గా పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకు అధికారులు కరసత్తు ప్రా రంభించారు. గతంలో ఉన్న పోలింగ్ కేంద్రాలతోపాటు, కొ త్తగా ఏర్పాటు చేయనున్న కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 800 మంది ఓటర్లకు ఒ క పోలింగ్ కేంద్రం చొప్పున ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణ కోసం సు మారు 1200లకుపైగా సిబ్బందితోపాటు జోనల్, బీట్, నోడ ల్, రూట్ అధికారులు ఎంత మంది అవసరమవుతారనే దా నిపై నివేదిక తయారు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సమర్థవంతంగా నిర్వహించేందుకు సం బంధిత అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles