సమస్యల పరిష్కారాని కి చర్యలు

Tue,July 9, 2019 01:45 AM

మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ : జిల్లా కేంద్రంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని అప్పన్నపల్లి, ఏనుగొండ, హౌసింగ్ బోర్డు కాలనీలలో సోమవారం జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి పర్యటించారు. ఆయా కా లనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ అప్పన్నపల్లి, హౌసింగ్ బోర్డు కాలనీల్లో డ్రైనేజీ సమస్య, ఏనుగొండలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి వార్డులో మున్సిపల్ అధికారులు పర్యటించి సమస్యల పరిష్కారం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, అన్ని కాలనీల్లో పారిశుధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం నిర్మాణాన్ని చేపట్టిందని, ఇప్పటికే పట్టణంలోని పలు వార్డులకు తాగునీరు అందుతుందన్నారు. త్వరలోనే ప్రతి ఇంటికీ శుద్ధమైన తాగునీరందించేందుకు చ ర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం హౌసింగ్ బోర్డులో ఓపెన్ జిమ్‌ను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కోరమోని వెంకటయ్య, మున్సిపల్ ఎంఈ సత్యనారాయణ, డీఈ మురళీ, మాజీ కౌ న్సిలర్ శివశంకర్, కేసీ నర్సింహులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles