కార్యకర్తలకు అండగా ఉంటాం

Mon,July 8, 2019 03:44 AM

చిన్నచింతకుంట : టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చిన్నచింతకుంట మండలంలోని బండార్‌పల్లి, లాల్‌కోట, పల్లమర్రి, మద్దూరు, అమ్మాపూర్, కురుమూర్తి, దాసరిపల్లి గ్రామాల్లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వాల్యానాయక్‌తో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్‌పర్సన్ స్వర్ణ సు ధాకర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్త కుటుంబానికి భరోసా ఉంటుందన్నారు. రా ష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు బంధు పథకంతో రైతులు ధీమాగా ఉ న్నారని తెలిపారు. రెండింతలు పెరిగిన ఆసరా పింఛ న్లు త్వరలోనే లబ్ధిదారులకు అందుతాయన్నారు. మం త్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డిల స హకారంతో జిల్లాను అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులతో పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. నాయకులు సమష్టిగా పని చేసి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి సభ్యత్వం అందించాలని తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ హర్షవర్దన్‌రెడ్డి, జెడ్పీటీసీ రాము రాజేశ్వరి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కర్ణాకర్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రవంతి మహేశ్‌గౌడ్, సర్పంచులు బీ సం ధ్యా రత్నం, రవీందర్‌రెడ్డి, సులోచన సత్యనారాయణగౌడ్, నాయకులు వజీర్‌బాబు, ప్రతీప్‌రెడ్డి, ప్రతాప్‌రె డ్డి, జానకీ రాములు, ఆంజనేయులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles