ఆధ్యాత్మికంతో పాటు ఆరోగ్యం ముఖ్యం

Mon,July 8, 2019 03:43 AM

భూత్పూర్: సమాజంలో ప్రజలు ఆధ్యాత్మికంతో పాటు ఆరోగ్యంపై దృష్టి సారించాలని వికాస తరంగిణ స్వామిజీ దేవనాథ జీయర్‌స్వామిజీ అన్నారు. ఆదివారం మున్సిపాలిటీలోని పంచవటి విద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జగదీశ్వర్, మహిళ ఆరోగ్య వికాస సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఆరోగ్య పరీక్షలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1కోటి 30లక్షల మంది 30 సంవత్సరాలు దాటిన వైవాహక జీవితాన్ని అనుభవిస్తున్న వారున్నారని ఆయన తెలిపారు. వీరిలో ముఖ్యంగా శారీరక పరంగా ఎన్నో సమస్యలున్నట్లు ఆయన తెలిపారు. మహిళలు తమలో ఎన్ని సమస్యలున్నా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఉంటారని ఆయన తెలిపారు. ముఖ్యంగా క్యాన్సర్ సంబంధ వ్యాధులు మహిళలో ఎక్కువగా వస్తుంటాయని ఆయన తెలిపారు. వీటిని ప్రారంభదశలోనే పరీక్షలు చేసి మందులను వాడితే కొంతవరకు శస్త్ర చికిత్సలు లేకుండానే నయం చేయొచ్చని ఆయన తెలిపారు. చాలా తక్కువ ఖర్చుతో క్యాన్సర్ తగ్గిందని చిన్నజీయర్‌స్వామి తెలిపినట్లు ఆయన తెలిపారు. వీటిని పరీక్షించడానికి యం త్రా లు, పరికరాలు చాలా అవసరమవుతాయని ఆయన తెలిపారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో మహిళలకు ఆరోగ్యపరీక్షలను చేస్తామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటుచేసే కేంద్రానికి అవసరమయ్యే ఖర్చులను తాను భరిస్తానని ఆయన తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో క్యాన్సర్ వ్యాధిని నయం చేయడం ఎంతో గొప్పవిషయమని అన్నారు. క్యాన్సర్ వ్యాధితో ఎంతో ప్రాణాలను కోల్పోతున్నారని ఆయన తెలిపారు. క్యాన్సర్ మన ఒంట్లో ఉన్న విషయం తెలియదని ఆయన తెలిపారు. ముఖ్యంగా మహిళలు తమ ఆరోగ్యంపై కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. భూత్పూర్, అమిస్తాపూర్, పొల్కంపల్లి గ్రామాలకు చెందిన మహిళలకు దాదాపు 3000మందికి పరీక్షలను చేశారు. కార్యక్రమంలో పంచవటి విద్యా సంస్థల అధినేతలు అనితశ్రీకాంత్‌రెడ్డి, వికాస తరంగిణి కో -ఆర్డినేటర్ మాధవి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సత్తూర్‌బస్వరాజ్‌గౌడ్, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ, భూత్పూర్ ఎంపీపీ కదిరెశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాచూరిచంద్రమౌళి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, మండల నాయకులు సత్తూర్‌నారాయణగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, గోప్లాపూర్ సత్యనారాయణ, అశోక్‌గౌడ్, ఆల యువ సేన జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.వనపర్తిలో 28న సినారె జయంతి వనపర్తి, నమస్తే తెలంగాణ: ఈ నెల 28న వనపర్తి జిల్లా కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మశ్రీ పద్మభూషణ్ డాక్టర్ సినారె నారాయణరెడ్డి 88వ జయం తి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు సినారె జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. ఆదివారం రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో ఉత్సవ కమిటీ సమావేశమయ్యారు. అనంతరం సినారె జయంతి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వాల్‌పోస్టర్, కరపత్రాలను మంత్రి నిరంజన్ రెడ్డి కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేసి పలు సూ చనలు, సలహాలను చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సినారె జయంతి ఉత్సవ, ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. వేడుకలకు ఉమ్మడి రాష్ట్రం నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి సాహితివేత్తలు, కవులు, సినారె కుటుంబ సభ్యులు, సినారెతో అనుబంధం ఉన్న ప్రముఖులు హాజరు అవుతున్నట్లు మంత్రి తెలిపారు.

సినారె జయంతి ఉత్సవ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, మహబూబ్‌నగర్ ఐదు జిల్లాలవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పా ఠశాలలు, కళాశాలలు విద్యార్థులందరికీ ఉపన్యాస, వ్యాసరచన, పాటల పోటీలను నిర్వహిండం జరుగుతుందని, అందులో గెలుపొందిన విద్యార్థులకు మం డల, జిల్లాస్థాయిలలో బహుమతులను ప్రదానం చే యడం జరుగుతుందన్నారు. విశ్వంభర రచనకే సినారెకు జ్ఞానపీఠ అవార్డు లభించిందని అందుకే సినారె వేడుకలను ప్రభుత్వపాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహిస్తుండంతో కళాశాలకు విశ్వంభర ప్రాంగణంగా నామకరణం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎంపీ రాములు, సభా ప్రారంభకులుగా తెలంగాణ సా హి త్య అకాడమి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, ప్రధాన వక్తగా ఓఎస్‌డీ దేశపతి శ్రీనివాస్, విశిష్ట అతిథులుగా సినారె కుటుంబ సభ్యులు, తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రసిద్ధ సాహితి విమర్శకులు కేంద్ర సాహిత్య అకాడమి సభ్యులు రామారావు, ఆత్మీయ అతిథులుగా సినీనటుడు, గేయ రచయిత తనికెళ్లభరణి, ప్రజాకవి, సినిగేయ రచయిత గోరంటివెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమి అధ్యక్షుడు శివకుమార్ వంటి అతిథులతో పాటు స్థానిక ప్రజాప్రతినిథులు పాల్గొంటారని వారు తెలిపారు. సమావేశంలో కమిటీ కన్వీనర్ వీరయ్య, అధ్యక్షుడు డాక్టర్ జయంతి, భాస్కర్‌రావు, వనపట్ల సుబ్బయ్య, బీంపల్లి శ్రీకాంత్, కోట్ల వెంకటేశ్వర్‌రెడ్డి, నాగవరం బలరాం, గుంటి గోపి, నారాయణరెడ్డి, జర్నలిస్టు మా ల్యాల బాలస్వామి, నరసింహ్మ శర్మ, డా దాసరి రంగ, నరేశ్, యాదగిరి, తిరుమలేశ్ పాల్గొన్నారు. సమన్వయంతో పని చేయాలికొల్లాపూర్, నమస్తేతెలంగాణ: పార్టీ అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా పనిచేయాలని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథం స్పష్టం చేశారు.

ఎవ్వరూ రెచ్చగొట్టిన రెచ్చిపోకుండగా సంయమనంతో వ్యవహరించాలని ఆయ న పార్టీ శ్రేణులకు సూచించారు. అందరూ సమన్వయంతో కలిసిపార్టీ అభివృద్ధికోసం పనిచేయాలన్నారు. ఇటీవల గెలుపొందిన కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఆదివారం పట్టణంలోని మహబూబ్‌పంక్షన్‌హాల్‌లో పెద్దకొత్తపల్లి మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు దండు నర్సింహ అధ్యక్షతన మాజీమంత్రి జూపల్లికృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన అభినందనసభలో మంద మా ట్లాడారు. జూపల్లి కృష్ణారావు తన హయాంలో కొల్లాపూర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. పార్టీ ఉంటేనే మనం ఉంటాం. పార్టీలు తీసుకునే నిర్ణయం మనకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉంటాయి. కొంత సంయమనాన్ని పాటించాలని మంద జగన్నాథం పార్టీ శ్రేణులకు సూచించారు. ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉండి తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసి ఉద్యమానికి వెన్నుదన్నుగా జూపల్లికృష్ణారావు నిలిచారని ఆయన గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ప్రభుత్వ నిఘావర్గాల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని జూపల్లికి సముచితస్థానం కల్పిస్తుందన్న ఆశాభావాన్ని జగన్నాథం వ్యక్తం చేశారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles