పేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం

Mon,July 8, 2019 03:41 AM

జడ్చర్ల : పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. ఆదివారం బాదేపల్లి మున్సిపాలిటీలోని శ్రీరాంనగర్ కాలనీ, జడ్చర్ల మండలంలోని చర్లపల్లి, నెక్కొండ గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధమైన తాగునీరు అందుతుందన్నారు. ఎమ్మెల్యే లకా్ష్మరెడ్డి సహకారంతో అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పిట్టల మురళీ, లక్ష్మయ్య, పర్మటయ్య, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. యజ్ఞంలా సభ్యత్వ నమోదుజడ్చర్ల : టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు యజ్ఞంలా సాగుతుందని రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్ అన్నారు. ఆదివారం జడ్చర్ల మండలంలోని చర్లపల్లి గ్రామంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని గ్రామస్తులకు సభ్యత్వాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జ డ్చర్ల నియోజకవర్గానికి ఇచ్చిన సభ్యత్వ నమోదు లక్ష్యం కంటే అధికంగా చేయాలని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్ర భుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, బీకేఆర్ కృష్ణకుమార్‌గౌడ్, వెంకటయ్య, వెంకటరమణ, ఇమ్మూ, తోటారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్ తదితరులు పాల్గొన్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles