టార్గెట్.. 2.88 కోట్లు

Sun,July 7, 2019 01:56 AM

ఐదో విడత హరితహారానికి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే నాలుగు విడతల్లో హరితహారం విజయవంతం కాగా.. ఈసారి 2.88 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో 40 వేల మొక్కలు నాటాలని టార్గెట్ పెట్టుకోగా.. జిల్లాలోని వివిధ శాఖల ఆధ్వర్యంలో 426 నర్సరీలలో మొక్కలు పెంచుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడమే తరువాయి.. హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించి మొక్కలు నాటనున్నారు. ఇప్పటికే జిల్లా అధికారులకు కలెక్టర్ రొనాల్డ్‌రోస్ దిశా నిర్దేశం చేశారు.

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సిద్ధమయ్యారు. తమ కు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించారు. వానలు పడిన వెంటనే మొక్కలు నాటేందుకు స న్నద్ధమవుతున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడా ది జిల్లాలో 2,88,12,120 మొక్కలు నాటి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ, డీఆర్‌డీఏ, డ్వామా ఆధ్వర్యంలో మొత్తం 426 నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ప్రస్తుతం ఆయా నర్సరీల్లో 2.35 కోట్ల మొక్కలు నాటేందుకు సిద్దంగా ఉన్నాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మొక్కలు నాటే లోగా మరిన్ని మొక్కలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈ విషయంపై సీ ఎం కేసీఆర్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు దిశ నిర్దేశం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆయా శాఖల అధికారులతో ప్రత్యే క సమావేశాలు ఏర్పాటు చేసి హరితహారం కార్యక్రమం కార్యరూపం దాల్చాలని ఆదేశాలు జారీ చేశారు.

ఖాళీ ప్రదేశాల అన్వేషణలో అధికారులు
హరిత లక్ష్యాన్ని పూర్తి చేసేందు కు ఆయా శాఖల అధికారులు ఖాళీ ప్రదేశా ల అన్వేషణలో నిమగ్నమయ్యారు. తమ శాఖ కార్యాలయాల మైదానాల్లో పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా గుంతలు తీసి సిద్ధం గా ఉంచేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.

వర్షం కురిస్తే మొక్కలు నాటాల్సిందే..
హరితహారంలో నాటే మొక్కలకు జీవనం పోసేలా వర్షం పుష్కలంగా కురిస్తే మొక్కలు నాటనున్నారు. గతంలో మాదిరి గా వర్షం కురువని ప్రాంతాల్లో మొక్కలు నాటే పరిస్థితి ప్రస్తుతం లేదు. వర్షాలు ఎక్కడైతే కురుస్తా యో ఆయా ప్రాంతాల్లో మా త్ర మే మొక్కలు నాటి జియో ట్యా గింగ్ చేసేందుకు అధికారులు చ ర్యలు తీసుకుంటున్నారు.

హరితహారంపై విస్తృత ప్రచారం
హరితహారంపై విస్తృత ప్రచా రం నిర్వహించేందుకు అధికారు లు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి గ్రా మంలో మొక్కలను నాటి పెంచే ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. హరితహారం కార్యక్రమాన్ని వి జయవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. హరితహారం కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ప్రతి శాఖకు ఇచ్చిన లక్ష్యాన్ని కేటాయించారు. ప్రతి గ్రామానికి వెళ్లే రోడ్డుకు ఇరువైపులా పంచాయతీరాజ్ శాఖ నుంచి 2వేల కిలోమీటర్ల మేర మొక్క లు నాటాలని నిర్ణయించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles