కేసీఆర్‌పాలన దేశానికే ఆదర్శం : ఎమ్మెల్యే ఆల

Sun,July 7, 2019 01:52 AM

దేవరకద్ర రూరల్: దేశానికే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. మండలంలోని బల్సుపల్లిలో పలు గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశ పెట్టారని, ముఖ్యంగా పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా వారికి ఆత్మబంధువు అయ్యిందన్నారు. అదేవిధంగా నిరుపేదలు అనారోగ్యంపాలయితే ఎంత ఖర్చయినా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారి కుటుంబాలకు అండగా ఉండి ఆదుకుంటుందన్నారు. కోయిలసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి కాల్వల నీటిని తరలించి ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 38 మంది లబ్ధ్దిదారులకు కళ్యాణలక్ష్మి, 4గురికి సహాయనిధి చెక్కులను అందజేశారు. అనంతరం వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరడంతో కార్యకర్తలకు పార్టీ సభ్యత్వ నమోదు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సరోజ, ఎంపీపీ రమాదేవి, జెడ్‌పీటీసీ అన్నపూర్ణ, వైస్ ఎంపీపీ సుజాత, మండల అధ్యక్షుడే శ్రీకాంత్‌యాదవ్, ఎంపీటీసీలు తిరుపతయ్య, నిర్మల, ఆంజనేయులు, లక్ష్మమ్మ, నాయకులు జెట్టి నర్సింహారెడ్డి, కొండ శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్, భాస్కర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

సీఎం కేసీఆర్ పాలనతోనే గ్రామాల ప్రగతి: జెడ్పీ చైర్ పర్సన్
చిన్నచింతకుంట: సీఎం కేసీఆర్ పాలనలోనే తెలంగాణలోని గ్రామాలు ప్రగతిబాట పట్టాయని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఎస్. స్వర్ణసుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక తాసిల్దార్ కార్యాలయ సమావేశపు హాలులో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 31 మంది కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులు, ఐదుగురికి సీఎం రిలీఫ్‌పండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో, సీఎం కేసీఆర్ సహయాంతో అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధ్దిలో దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా తాసిల్దార్ రాజు, జెడ్పీటీసీ రామురాజేశ్వరి, కార్యాలయ సిబ్బందితోపాటు తదితరులు జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యేను పూలమాలలు, శాలువాతో సన్మానించారు. ఎంపీపీ ఎస్.హర్శవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన వహించారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ సుమతిరమేశ్, కో ఆప్సన్ సభ్యులు మహిమూద్, నాయకులు కురుమూర్తి దేవస్థాన చైర్మన్ సురేందర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ప్రతీప్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మోహన్‌గౌడ్‌తోపాటు ఎంపీడీవో ఫయోజోద్దీన్, కార్యాలయ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్, తాసిల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తిరుపతయ్య, వజీర్‌బాబు, జనార్థన్, జలిల్‌తోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles