సంక్రమిత వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Sun,July 7, 2019 01:52 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: పెంపుడు జంతువులను పెంచుకునే అలవాటు ఉన్న యజమానులు వాటి నుంచి మనుషులకు సంభవించే వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బీ మధుసూదన్‌గౌడ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పశు సంవర్థక శాఖ కార్యాలయంలో జూనోసిస్ డే కార్యక్రమంలో భాగంగా పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంపుడు జంతువులు, పశువుల నుంచి వచ్చే సాంక్రమిక వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయడం వల్ల కొన్ని రకాల రోగాలను జంతువుల నుంచి మనుషులకు సంక్రమించకుండా నివారించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. వ్యాధుల సంక్రమించకుండా, భోజనానికి ముందు చేతులను సబ్బునీటితో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. బాగా ఉడికించిన వేడిగా ఉన్న మాంసాహారం, గుండ్లను మాత్రమే తినాలని సూచించారు. నిల్వ ఉంచిన మాంసమును తినకపోవడం శ్రేయస్కరమన్నారు. ఈ సందర్భంగా జిల్లా పశు వైద్య శాలలో 196 పెంపుడు కుక్కలకు రేబీస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. సహయ సంచాలకులు డాక్టర్ యేసువరం, వైద్యాధికారులు డాక్టర్ భవ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles