విద్యను ప్రోత్సహించడం గొప్ప విషయం

Sun,July 7, 2019 01:50 AM

భూత్పూర్: యువకులు విద్యను ప్రోత్సహించడం గొప్ప విషయమని మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు మనెమోని సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని పోతులమడుగులో ఉయ్ కెన్ మేక్ ఏ చేంజ్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు సంస్థ ఫౌండర్ కార్తీక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన పాల్గొని వారిని అభినందించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులే చదువుతున్నారు. వారి అభివృద్ధి కోసం సంస్థ సహకరిస్తుందని తెలిపారు. పిల్లలు చదువును నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ్దతో చదవాలని కోరారు. గ్రామానికి చెందిన యువకులే ఈ సంస్థను స్థాపించండం వలన పోతులమడుగు విద్యార్థులను ప్రోత్సహించడం శుభసూచకమని తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎం సరళజాయ్, ఉపసర్పంచ్ సుక్కమ్మ, మాజీ ఎంపీటీసీ రమేష్‌చందర్‌నాయక్, గ్రామస్తులు కరుణాకర్‌రెడ్డి, తిరుపతయ్యగౌడ్, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

41
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles