పేటకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి

Fri,July 5, 2019 03:41 AM

నారాయణపేట రూరల్ : నారాయణపేట మండలాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకుపోయి పేటకు బ్రాండ్ ఇమేజ్‌ను తీసుకురావాలని మండల నూతన పాలక వర్గానికి ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ సుగుణతోపాటు పలువురు ఎంపీటీసీలను ప్రిసైడింగ్ అధికారి భూపాల్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తూ ప్రతి ఎకరాకు సాగునీరు అందించి రైతుల కష్టాలు తీరుస్తానని అన్నారు. నూతనంగా కొలువుదీరిన పాలకవర్గం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలని ఆయన సూచించారు. ఈ సందర్బంగా ఎంపీపీ అమ్మకోళ్ళ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిని గజమాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ సురేఖ, జెడ్పీటీసీ అంజలి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు తాజుద్దీన్, వైస్ ఎంపీపీ సుగుణ భగవంతు, మాజీ ఎమ్మెల్యే ఇందిర, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగరాజు, వైస్ చైర్మన్ చెన్నారెడ్డి, మండల, పట్టణ అధ్యక్షులు వేపూరి రాములు, కోట్ల రాజవర్ధన్‌రెడ్డి, నాయకులు గందె చంద్రకాంత్, సుదర్శన్‌రెడ్డి, ఘన్‌శ్యాందాస్ ధారక్, కోట్ల జగన్మోహన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles