ప్రజల మనసులు గెలవాలి

Fri,July 5, 2019 03:40 AM

మరికల్ : రాజకీయల్లో ప్రజా క్షేత్రంలో కంటే ప్రజా సమస్యలు తీర్చి ప్రజల మనస్సులు గెలవాలని ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మరికల్ మండల నూతన ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తీర్చి ప్రజల మన్ననలు పొందాలని, అప్పుడే పదవికి న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరే విధంగా నూతన పాలక మండలి సభ్యలు చొరువ చూపాలని కోరారు. అంతకు ముందు ఎంపీడీవో కార్యాలయన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎంపీపీగా శ్రీకళరాజవర్ధన్‌రెడ్డి, వైస్ ఎంపీపీగా రవికుమార్ యాదవ్, ఎంపీటీసీలుగా గోపాల్, జయమ్మ, సునీత, దేవేందర్‌రెడ్డి, ఆంజనేయు లు, మంజుల, మణేమ్మ, రాజు, సుజాతలతో జిల్లా పంచాయతీ అధికారి మురళి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతన ఎంపీపీ శ్రీకళరాజవర్ధన్ రెడ్డిని, పాలక మండలిని టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యాక్రమంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ నాయకులు, సర్పంచులు, ఎంపీడీవో సద్గుణ తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles