.. అను నేను

Thu,July 4, 2019 05:44 AM

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: 2014లో స్థానిక సంస్థల ఎన్నుకోబడిన ఎంపీటీసీల, ఎంపీపీల పదవీ కాలం ముగియడంతోనూ తన ఎంపీటీసీలు, ఎంపీపీలు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం నూతన మండలాదీశులు అధికార బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు మండలస్థాయి అధికారులు అన్ని ఏర్పాట్ల ను చేపట్టారు. జిల్లాలోని 12 మండలాల్లో మొ త్తం 141 ఎంపీటీసీలకు ఎన్నికల అధికారులు పో లింగ్ నిర్వహించగా వీటిలో 99 ఎంపీటీసీ స్థానాలను టీఆర్‌ఎస్ పార్టీ సొంతం చేసుకుంది. 17 ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీకి, 11 ఎంపీటీసీలు బీజేపీకి, 14 ఎంపీటీసీ స్థానాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఫలితాలతో గద్వా ల, ధరూర్, కేటీదొడ్డి, మల్దకల్, గట్టు, అలంపూర్, అయిజ, ఉండవెల్లి, ఇటిక్యాల, వడ్డేపల్లి టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీపీలను కైవసం చేసుకోగా మానవపాడు మండలంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఏర్పాటు చేపట్టిన అధికారులు
నూతన ఎంపీపీలు, ఎంపీటీసీలు కొలువుదీరు తున్న సందర్భంగా అన్ని మండలాల్లోని అధికారు లు ప్రమాణ స్వీకారానికి కావల్సిన ఏర్పాట్లను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయా నియోజ కవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణ మోహ న్ రెడ్డిని, డాక్టర్ వీఎం అబ్రహంను ముఖ్య అతి థులుగా ఆహ్వానించారు. అధికారులు నిర్వహించి న సమయం ప్రకారం ఉదయం 11గంటల నుంచి అన్ని మండల ప్రజాపరిషత్ కార్యాల యాల్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్ర మా న్ని చేపట్టనున్నారు. ఇందుకోసం ఎంపీపీ కార్యాలయాలను అలంకరించి సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారు లతో పాటు ఆయా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరుకానున్నారు. ప్రమాణ స్వీకా రం ముగిసిన అనంతరం నూతన ఎంపీపీ లు, ఎంపీటీసీలు పదవీ బాధ్యతలు చేపట్ట నున్నారు.

టీఆర్‌ఎస్‌కు 10ఎంపీపీలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ 10 ఎంపీపీ స్థానాలను సాధించింది. మిగిలిన రెండు స్థానాల్లో మానవపాడు ఎంపీపీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోగా అలంపూర్ ఎంపీపీగా ఎన్నికను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. గద్వాల మండలంలో టీఆర్‌ఎస్ ఎంపీపీగా ఎ.ప్రతాప్ గౌ డ్, ఎం.దామోదర్ వైస్ ఎంపీపీగా, మస్తాన్ కో ఆప్షన్ మెంబర్‌గా ఎన్నుకోబడ్డారు. గద్వాల మం డలంలో మొత్తం 13 ఎంపీటీసీలుండగా టీఆర్ ఎస్ పార్టీ 12కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నా యి. టీఆర్‌ఎస్ పార్టీ సంపూర్ణమైన మెజార్టీ ఉండ టంతో ఏకగ్రీవంగా ఎంపీపీని ఎన్నుకున్నారు.

ధరూర్ మండల ఎంపీపీగా నజీమున్నీసా బేగం ను, వైస్ ఎంపీపీగా పి.సుదర్శన్‌రెడ్డి, కో ఆప్షన్ మెంబర్‌గా అమీర్ అలీని ఎన్నుకున్నారు. ధరూర్ మండలంలో మొత్తం 14ఎంపీటీసి స్థానాల్లో 08 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీ, 6 ఎంపీటీసీలు బీజే పీ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా టీఆర్‌ఎ స్‌కు మెజార్టీ ఉండటంతో ఏకగ్రీవంగా ఎంపీపీ అభ్యర్థిని ఎన్నుకున్నారు.

మల్దకల్ ఎంపీపీగా రాజారెడ్డిని, వైస్ ఎంపీపీగా పెద్ద ఈరన్నను, కోఆప్షన్ సభ్యునిగా హైదర్ సాబ్ ను ఎన్నుకున్నారు. ఈ మండలంలో 10 ఎంపీటీ సీలు టీఆర్‌ఎస్, ఒక ఎంపీటీసీ కాంగ్రెస్, 3 ఎంపీ టీసీ స్థానాల్లో బీజేపీలు అభ్యర్థులు గెలుపొం దారు. టీఆర్ ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటం తో ఏకగ్రీవంగా ఎంపీపీని ఎన్నుకున్నారు.
కేటీదొడ్డిలో ఎంపీపీగా జి.మనోరమా, వైస్ ఎంపీ పీగా రామకృష్ణ నాయుడు, కోఆప్షన్ మెంబర్‌గా హుస్సైన్‌బీలను ఎన్నుకున్నారు. మండలంలో 10 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్, ఒక ఇండి పెండెంట్ అభ్యర్థి గెలుపొందడంతో ఏకగ్రీవంగా ఎంపీపీని ఎన్నుకున్నారు.

గట్టు మండలం ఎంపీపీగా జె.విజ య్ కుమార్‌ను, వైస్ ఎంపీపీగా మేకల సుమతిని, కోఆప్షన్ మెంబర్‌గా అబ్దుల్ వహీద్‌ను ఎన్నుకున్నారు. గట్టు మండలంలో 16 ఎంపీటీసీ స్థానాల్లో 11 ఎంపీటీసీలు టీఆర్ ఎస్, ఒక ఎంపీటీసీ కాంగ్రెస్, 2 ఎంపీటీసీలు బీ జేపీ, 2 ఎంపీటీసీలు స్వతంత్రులు గెలుపొందా రు. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ రావడంతో ఎంపీపీని ఎన్నుకున్నారు.
మానవపాడులో ఎంపీపీగా కె.అశోక్ రెడ్డిని, వైస్ ఎంపీపీగా టి.సోమన్న గౌడ్‌ను, కోఆప్షన్ సభ్యు నిగా ఎండీ.సిరాజ్ అహ్మద్‌ను ఎన్నుకున్నారు. ఈ మండలంలో 4ఎంపీటీసీలు టీఆర్‌ఎస్, 5ఎంపీ టీసీలు కాంగ్రెస్ గెలుపొందటంతో కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ స్థ్థానాన్ని కైవసం చేసుకుంది.

ఉండవెల్లిలో ఎంపీపీగా బీసమ్మ, వైస్ ఎంపీపీగా డి.దేవన్న, కోఆప్షన్ సభ్యునిగా చిన్న బూశయ్యను ఎన్నుకున్నారు. ఈ మండలంలో 4 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్, 4 ఎంపీటీసీలు కాంగ్రెస్, 2 ఎంపీటీసీ లు ఇండిపెండెంట్ అభ్యర్థులు సొంతం చేసుకు న్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మెజార్టీని సొంతం చేసు కోవడంతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

రాజోళిలో ఎంపీపీగా ఎన్.మాణిక్యమ్మను, వైస్ ఎంపీపీగా ఎం.రేణుకను, కోఆప్షన్ సభ్యునిగా సత్యమ్మను ఎన్నుకున్నారు. ఈ మండలంలో 5 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌కు, 2ఎంపీటీసీలు కాంగ్రె స్‌కు, 3 ఎంపీటీసీల్లో ఇం డిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఎన్నికల్లో అత్య ధిక ఓట్లు రావడంతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

వడ్డేపల్లిలో ఎంపీపీగా రజితమ్మ, వైస్ ఎంపీపీగా జి.చంద్రశేఖర్ గౌడ్, కోఆప్షన్ సభ్యునిగా ఎండి. దావుద్‌ను ఎన్నుకున్నారు ఈ మండలంలో 4 ఎంపీటీసీలు టీఆర్‌ఎస్, ఒక ఎంపీటీసీ కాంగ్రెస్, ఒక ఎంపీటీసీలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలు పొందారు. టీఆర్‌ఎస్‌కు అధిక్యం ఉండటంతో ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఇటిక్యాల మండలంలో ఎంపీపీగా వి.స్నేహ, వైస్ ఎంపీపీగా సుజాతమ్మ, కోఆప్షన్ సభ్యునిగా మహ మూద్‌ను ఎన్నుకున్నారు. ఈ మండలంలో 11 ఎంపీటీసీల్లో టీఆర్‌ఎస్, ఒక ఎంపీటీసీ, ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారు. టీ ఆర్‌ఎస్ మెజార్టీ ఎంపీటీసీలు ఉండటంతో ఎం పీపీ స్థానాన్ని చేజిక్కించుకుంది.

ఇక అయిజ మండలంలో ఎంపీపీగా తిరుమల్ రెడ్డి, వైస్ ఎంపీపీగా నాగే శ్వర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యునిగా చాంద్ నాయక్‌ను ఎన్నకున్నారు. ఈ మండలంలో 16 ఎంపీటీసీ స్థానాల్లో 14 ఎంపీ టీసీలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకోగా ఒక ఎంపీ టీసీ కాంగ్రెస్, ఒక ఎంపీటీసి స్థానంలో ఇండి పెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మెజార్టీ ఉండటంతో ఏకగ్రీవంగా ఎంపీపీని ఎన్నకున్నారు.

హంగ్ స్థానాల్లో టీఆర్‌ఎస్ హవా
ఎంపీటీసీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడిన ఉండవెల్లి, రాజోళి మండలాల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీపీ స్థా నాలను కైవసం చేసుకొని తన సత్తాను చాటింది. ఉండవెల్లి మండలంలో టీఆర్‌ఎస్‌కు 4, కాంగ్రె స్‌కు 4, ఇండిపెండెంట్‌లకు 2 ఎంపీటీసీ స్థానాలు రావడంతో ఈ మండలంలో ఎంపీపీ ఎన్నిక కు హంగ్ ఏర్పడింది. అయితే ఇండిపెండెంట్ గా గె లుపొందిన తక్కశిల అభ్యర్థి బీసమ్మ టీఆ ర్‌ఎస్ పార్టీలో చేరడంతో కథ మలుపు తిరిగింది. కాం గ్రెస్ పార్టీ తరుపున గెలు పొందిన ఎం పీటీసీలు పార్టీలకు అతీతంగా బీసమ్మకు మద్దతు తెలపడం తో టీఆర్‌ఎస్ పార్టీయే ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక హంగ్ ఏర్పడిన మరోక మండ లం రాజోళిలో కూడా టీఆర్‌ఎస్ పార్టీయే జయ కేతనం ఎగరవేసింది. టీఆర్‌ఎస్ 5, కాంగ్రెస్ 2, ఇండి పెండెంట్ 3 ఎంపీటీలను సొంతం చేసు కుంది. ఇందు లో ఇద్దరు కాం గ్రెస్ ఎంపీ టీసీ లు, ఇద్దరు ఇం డిపెండెంట్ ఎం పీటీసీలు టీఆ ర్‌ఎస్‌కు మద్దు తు నిచ్చారు. ఇక మిగిలిన పె ద్ద తాండ్రపా డు ఎంపీటీసీ ఎన్ని కకు హాజరుకా కపోవడంతో సంపూర్ణ బలా న్ని సాధించిన టీఆర్‌ఎస్ ఎం పీ పీ స్థానాన్ని కైవ సం చేసుకుంది.

నలుగురి ఎంపీటీసీలపై అనర్హత వేటు
అలంపూర్ మండలంలోని మొత్తం ఆరుగురు ఎంపీటీసీలగాను నలుగురు ఎంపీటీసీలు పార్టీ విఫ్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ పాల్గొనినందున విఫ్ జారీచేసిన లింగనవాయి ఎంపీటీసీ జ్యోతి ఆర్‌వో కు ఫిర్యాదు చేయగా వారిపై ఎలక్షన్ కమిషన్ అనర్హత వేటు వేసింది. దీంతో అరుగురు ఎంపీటీ సీలకు గాను నలుగురు ఎంపీటీసీలపై విప్ వేటు పడగా ఇద్దరు మాత్రమే నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles