స్వచ్ఛత కోసం సమరం

Thu,July 4, 2019 05:42 AM

- మరుగుదొడ్లు నిర్మించుకోవాలని ఉద్యోగుల ప్రచారం
- మరుగుదొడ్లు లేని ఇండ్ల ముందు ధర్నా
- ధర్నాతో పది మందిలో కదలిక

రాజోళి: స్వచ్ఛతపై సమరం తీవ్రమైం ది. గ్రామాల్లో మరుగుదొడ్లపై అవగాహన పెరిగింది. కాని కదలిక లేని వాళ్లను కూడా కదిలించేలా ఉద్యోగులు వినూత్న రీతిలో ప్రచారం మొదలు పెట్టారు. గ్రామం బాగుండాలంటే ముందు మన ఇళ్లు బాగుండాలని, ఇంటి పరిసరాలు బాగుండాలని అందరూ భావిస్తే గ్రా మంలో స్వచ్ఛత నెలకొంటుందని అం టున్నారు. ఈ క్రమంలో అధికారులు క్షేత్రస్థాయిలో మరుగుదొడ్లపై పర్యవేక్షణ చేస్తునాన్నారు. ఎంత చెప్పినా మరుగుదొడ్డి నిర్మాణానికి ముందుకు రాని వా రికి మాత్రం వివిధ రకాలుగా మరుగుదొడ్డిని నిర్మించుకునేలా చేస్తున్నారు. అందు లో భాగంగా బుధవారం ఉపాధి హామీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యం లో మరుగుదొడ్లు లేని వారి ఇళ్ల ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. మధ్యా హ్నం సమయంలో మరుగుదొడ్లు లేని వారి ఇంటికి వెళ్లి కలెక్టర్ ఆదేశాల అనుశారం మరుగుదొడ్డి నిర్మించుకోకపోతే జరిగే నష్టాలను తెలియజేశారు. పరిస్థితిని వివరించినా ముందుకు రాని వారి ఇళ్ల ముందు ధర్నాకు బైఠాయించారు. గ్రామంలో స్వచ్ఛతకు సహకరించాలని, మరుగుదొడ్డిని నిర్మించుకుని మీ కుటుం బ సభ్యులు, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా ఉండేలా చూడాలని నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. ఉద్యోగులు చేస్తున్న వినూత్నమైన ప్రచారానికి స్థానికులు ఒక దశలో ఆశ్చర్యపోయినప్పటికీ, అంద రూ హర్షం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి కోసం, గ్రా మంలో స్వచ్ఛతకోసం అధికారులు చేస్తున్న ప్రయత్నం చాలా సం తోషించదగ్గ విషయమని అన్నారు.

గ్రా మాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా అధికారులు ఇంతగా పనిచేయడం పట్ల అందరూ సంతోషం వ్యక్తపరిచారు. వీరి ధర్నాతో స్పందించిన పది మంది మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని, అప్పు డే ఇంటి పరిసరాలతో పాటు, గ్రామం కూడా స్వచ్ఛంగా మారుతుందని అన్నా రు. మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం కూడా అందుతుందని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధిహామీ సిబబ్బంది రామలింగేశ్వర ప్రసా ద్, సుల్తాన్, గ్రామ పంచాయతీ సిబ్బంది ఆంజనేయులు, లక్ష్మీనారాయణ తదిదరులు పాల్గొన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles