వీఆర్‌వోలకు ప్రమోషన్లలో కదలిక

Thu,July 4, 2019 05:40 AM

- దాదాపు 150 మందికి ప్రమోషన్లు వచ్చే అవకాశం
- వివరాలు సేకరిస్తున్న రెవెన్యూ అధికార యంత్రాంగం

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : సీనియార్టీ, విద్యార్హత, తదితర వివరాలను పరిగణలోకి తీసుకుంటూ సీనియార్టీ ప్రాతిపదికన వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించేం దుకు జిల్లా ఉన్నత అధికారులు సిద్ధం అయ్యారు. ఈ మేరకు గత ఏడాది ప్రచురించిన సీనియార్టీ జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటునానరు. వీరిలో ఎవరైనా విద్యార్హత తదితర వివరాలతో పాటు అందుకు సంబంధించిన ధ్రువపత్రాలు జత చేయాల్సి ఉన్న వారి పత్రాలను పరిగణనలోకి తీసుకుంటూ వీఆర్‌ఏలకు వీఆర్‌వోలుగా పదోన్నతులు కల్పించేందుకు జిల్లా ఉన్నత అధికారులు కసరత్తు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 మంది వీఆర్‌ఏలకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టరేట్ కార్యాలయ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులైన వీఆర్‌ఏలకే పదోన్నతులు కల్పించాలని వీఆర్‌ఏల సంఘాల నేతలు పేర్కొంటున్నారు. పూర్తి స్థాయిలో సమగ్ర సమాచారం ధ్రువపత్రాలను పరిశీలించిన తరువాత మరో రెండు, మూడు రోజుల్లో వీఆర్‌ఏలకు వీఆర్‌వోలగా పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles