మున్సిపోల్స్‌కు రెడీ..

Wed,July 3, 2019 03:36 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : పుర పోరుకు రంగం సిద్ధమైంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమైంది. పాలమూరు జిల్లా పరిధిలో మహబూబ్‌నగర్, బాదేపల్లి, భూత్పూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో గతంలో ఉన్న వార్డులకు అదనంగా కొత్తగా వార్డులను ఏర్పాటు చేశారు. కొత్త వార్డుల కేటాయింపుతో మరింత మంది కౌన్సిలర్లుగా పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు వార్డుల ప్రకటన తర్వాత వార్డుల విభజన సైతం పూర్తయింది. తమ తమ పరిధిలోకి వచ్చే వార్డుల్లో రిజర్వేషన్లు ఎలా వస్తాయో అనే ఆందోళన, ఉత్కంఠ ఆశావహుల్లో కనిపిస్తోంది. అయితే ఇప్పటికే వార్డుల్లో కులాల వారీగా ఓటర్ల విభజన పూర్తి చేశారు. ఈ వివరాలను సీడీఎంఏకు సైతం పంపించారు. ఇక ప్రభుత్వం వార్డుల రిజర్వేషన్ల కోసం ఎప్పుడు షెడ్యూల్ విడుదల చేస్తుం దా.. అని పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు ఎదురు చూ స్తున్నారు. సాధ్యమైనంత త్వరలోనే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూలై చి వరి నాటికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి పుర ఎన్నికలు నిర్వహిస్తారని అంచనా వేస్తున్నారు.

మహబూబ్‌నగర్‌లో అత్యధికం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో 41 వార్డులు ఉండేవి. 2011 జనాభా ప్రకారం వార్డుల సంఖ్య పెరి గింది. అదనంగా 8 వార్డులను కేటాయించారు. ఈ పెంపుతో మొత్తం 49కి వార్డుల సంఖ్య చేరింది. ఇక బాదేపల్లిలో గతంలో 20 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 7 వార్డులను పెంచడంతో 27 వార్డులకు చేరింది. భూత్పూరులో 3 వార్డులను కొత్తగా ప్రకటించడంతో మొత్తం వార్డుల సంఖ్య 10కి చేరింది.

మహబూబ్‌నగర్‌లో పూర్తయిన బీసీ ఓటర్ల గణన
మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు చేపట్టేందుకు అనుగుణంగా కులాల వారీగా ఓటర్ల గణన చేపట్టారు. 2014 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 1,42,202 ఓటర్లను గుర్తించారు. ఇందులో బీసీ ఓటర్లే అధికంగా ఉన్నారు. 83,168 మంది బీసీలు ఓటర్లుగా ఉన్నారు. ఇతర వర్గాలు 46,438, ఎస్సీలు 8,912, ఎస్టీలు 3,684 మంది ఉన్నారు. ప్రస్తుతం చేపట్టిన కుల గణనలో సైతం బీసీలే అధికంగా ఉన్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్‌తో పాటు, బాదేపల్లి, భూత్పూరులో సైతం ప్రస్తుతం వార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల వారీగా ఓటర్ల ముసాయిదాను ఈనెల 6వ తేదీన విడుదల చేస్తారు. ఈ ముసాయిదా ఆధారంగా వార్డుల్లో రిజర్వేషన్ల సంఖ్యపై ఓ అంచనా వస్తుందని ఆశావహులు ఎదురుచూస్తున్నారు.

ఆశావహుల్లో ఉత్కంఠ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 8, బాదేపల్లిలో 7, భూత్పూరులో 3 చొప్పున వార్డుల సంఖ్య పెరిగింది. పాత వార్డులతోపాటు కొత్త వార్డుల్లోనూ ఆశావహులు పోటీ కోసం ఎదురుచూస్తున్నారు. చాలా చోట్ల తాము పోటీ చేయాలని భా విస్తున్న వార్డుల్లో ఇప్పటికే ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పలు చోట్ల వివిధ పనులు చేసి పెట్టి తమకు ఓటె య్యాలని కోరుతున్నారు. మరోవైపు కొత్త ఓటర్లను నమో దు చేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇంటింటికీ తి రిగి కొత్తగా అద్దెకు వచ్చిన వారి నుంచి ఫొటోలు, ఆధార్ కార్డు లు సేకరించుకుని ఓటర్ల నమోదు ప్రక్రియ చేపడు తున్నారు. ఓటర్ నమోదు చేయించామనే అభిమానంతో తమకే ఓటే స్తారని పోటీ కోసం రంగం సిద్ధం చేసుకున్న వారు భావిస్తున్నా రు. ఇక ఇప్పటికే చైర్మన్లు, చైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు మరోసారి తమకు అవకాశం దక్కుతుందని గట్టి నమ్మకంగా ఉన్నారు.

పాలమూరు మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్
మున్సిపాలిటీల పాలకవర్గం పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగనున్నది. మహబూబ్‌న గర్ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. బాదేపల్లి మున్సి పాలిటీ ప్రతేకాధికారిగా మహబూ బ్‌నగర్ ఆర్డీవో శ్రీనివాసులు, భూ త్పూరు మున్సిపాలిటీ ప్రత్యేకాధికా రిగా మహేం దర్‌రెడ్డి(తాసిల్దార్)లు కొనసాగు తున్నారు.

వార్డుల విభజన పూర్తి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో 41 వార్డులు ఉండేవి. ప్రస్తుతం 8 వార్డుల పెంపుతో 49కి చేరింది. అ న్ని వార్డుల విభజన పూర్తయ్యింది. ప్రస్తుతం ప్రతి వార్డు నైసర్గిక స్వ రూపం సిద్ధమైంది. ఇక వార్డుల వా రీగా రిజర్వేషన్లు మాత్రమే జరగాల్సి ఉంది. వార్డుల్లో కులాల వారీగా ఓ టర్ల గణన పూర్తి చేశాం. వివరాలు సీడీఎంకు పంపించాం. షెడ్యూలు విడుదల తర్వాత వార్డుల వారీగా రిజర్వేషన్లు చేపడతారు.
- సురేందర్, మున్సిపల్ కమిషనర్

56
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles