పశువులను రోగాల నుంచి కాపాడండి

Wed,July 3, 2019 03:33 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ : పశువులు రోగాల బారిన పడకుండా అవసరమైన మందులను సరియైన సమయంలో అందించేందుకు పశువైద్య అ ధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వీసీ ద్వారా జిల్లా పశువైద్య అధికారులతో మాట్లాడారు. పశువులకు ఈ సీజన్‌లో గాలికుంటు వ్యాధి సో కుతుందని, ముందస్తుగా వ్యాధి నివారణకు టీకాలు ఉచితంగా వేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి 22వ తేదీ వరకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని సూచించారు. గాలికుంటు వ్యాధి ద్వారా పాడి రైతులు నష్టపోతున్నారని, ఈ వ్యాధిని రాష్ట్రం నుంచి పాలదోలడానికి ప్ర భుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. పవువైద్య అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటు ముందుకు సాగాలని సూచించారు. పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్‌కుమా ర్, పశు సంవర్ధక శాఖ అదనపు సంచాలకులు రాంచంద ర్ మాట్లాడుతూ ప్రతి గ్రామం లో ప్రతి పశువుకు నివారణ టీకాలు వేయాలన్నారు. ప్ర ణాళికలను ఏర్పాటు చేసిన ప్రతి గ్రామంలో ముందస్తుగా దండోరా వేయించి టీకాలు వేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొనే విధంగా అధికారులు సమాచా రం అందించి ముందుకు సాగాలన్నారు. జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ బీ మధుసూదన్ మాట్లాడుతూ జిల్లా లో 39 పశువైద్య బృందాలు, నారాయణపేట జిల్లాలో 34 పశువైద్య బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అన్ని గ్రామా ల్లో ప్రణాళిక ప్రకారం వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించడం జరు గుతుందన్నారు. గాలికుంటు వ్యాధి నివారణ మందులను పక్కా ప్రణాళికలతో పశువులకు వేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారులు ఉన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles