టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన

Wed,July 3, 2019 03:32 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి వివేష స్పందన లభిస్తుందని టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు మహబూబ్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అందె బాబన్న స్పష్టం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వచ్ఛందంగా టీఆర్‌ఎస్ సభ్యత్వం చేస్తున్న ప్రాంతాలకు చేరుకుని తమ పేర్లు నమోదు చేసిన రషీదు ఇవ్వాలని కోరుతుండడం చూస్తుంటే మాటల్లో చెప్పలనంతంగా సంతోషం కల్గుతుందన్నారు. హన్వాడతోపాటు పట్టణంలోని చాలా ప్రాంతాల్లో టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం శరవేగంగా జరుగుతుందని తెలిపారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు ఎంతో మేలు చేకూరడం జరుగుతుందని వారికి అందించిన సంక్షేమ ఫలాల ద్వారానే ప్రజలు భారీగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గానికి టీఆర్‌ఎస్ అధిష్టానం 50వేల సభ్యత్వ లక్ష్యం ఇవ్వడం జరిగిందని.. అంతకుమించి సభ్యత్వ నమోదు స్వచ్ఛందగా ప్రజలు చేసుకోవడం ఖాయమన్నారు. టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు కొరమోని వెంకటయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్ నాయకులు కేవలం సభ్యత్వ నమోదు పుస్తకాలను తీసుకుని కాస్తకూడా తిరగకముందే సభ్యత్వాల పుస్తకాలు అయిపోయే స్థాయిలో ప్రజలు టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు చూపిస్తున్న అభిమానం మాటల్లో చెప్పలేమన్నారు. మార్కెట్ చైర్మన్ ఆంజనేయులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేశ్వర్, ఉపాధి హామీ రాష్ట్ర డైరెక్టర్ కోట్ల కిశోర్‌రెడ్డి, పట్టణ కార్యదర్శి శివరాజ్, మోహన్‌బాబు తదితరులు ఉన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles