హరితహారం లక్ష్యాన్ని చేరుకోవాలి

Wed,July 3, 2019 03:30 AM

మక్తల్ రూరల్ : మక్తల్ పట్టణంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లోనూ హరితహారం కార్యక్రమంలో భాగంగా విరివిగా మొక్కలను నాటాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. మక్తల్ మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆయన హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలను నాటారు. అనంతరం హరితహారం, మరుగుదొడ్ల నిర్మాణంపై అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మక్తల్ మండలంలో మొత్తం కోటి మొక్కలను నాటేందుకు గానూ లక్ష్యం విధించడం జరిగిందన్నారు. పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమానికి సహకరించి విజయవంతం అయ్యేలా చూడాలన్నారు. అలాగే మరుగుదొడ్ల నిర్మాణంలో మక్తల్ మండలం వెనుకంజలో ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు గానూ క్షేత్రస్థాయిలో ప్రజలను చైతన్యం చేయాలన్నారు. ఇప్పటి వరకు మండలంలో కేవలం 65శాతం కుటుంబాలు మాత్రమే మరుగుదొడ్లను నిర్మించుకోవడం జరిగిందన్నారు. జూలై 12లోపు 100శాతం మరుగుదొడ్లను నిర్మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో చీర్ల శ్రీనివాసులు, తాసిల్దార్ శ్రీనివాసులు, డీటీ కాళప్ప, ఇన్‌చార్జి ఎంపీడీవో పావని, ఏపీవో మాధవరెడ్డి, ఏపీఎం నారాయణ, ఆర్‌ఐలు సురేశ్, మధన్‌మోహన్‌రెడ్డితో పాటు పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles