బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు : ఎస్పీచేతన

Wed,July 3, 2019 03:29 AM

నారాయణపేట క్రైం : నారాయణపేట జిల్లా పరిధిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ డాక్టర్ చేతన పేర్కొన్నారు. మంగళవారం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను స్థానిక కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించి మాట్లాడారు. ఆపరేషన్ ముస్కాన్ టీంలో ఒక ఎస్సైతో పాటు ముగ్గురు కానిస్టేబుల్స్, ఒక మహిళా కానిస్టేబుల్ సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. హోటల్స్‌లో, ఇటుక బట్టీలలో, వ్యవసాయ పనుల్లో, పశువుల కాపరులుగా, ఇతర పనుల్లో కొంతమంది చదువుకు దూరంగా ఉంటూ బాలకార్మికులు కొనసాగుతుండగా మరికొంత మంది వీధుల్లో భిక్షాటన చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఆపరేషన్ ముస్కాన్ టీం సభ్యులు చదువుకు దూరంగా ఉన్న, తప్పిపోయిన పిల్లలను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించి వారిని బడిలో చేర్పించడం జరుగుతుందన్నారు. 14 ఏళ్లలోపూ పిల్లలను పనిలో పెట్టుకుంటే 1986 బాలకార్మిక వ్యతిరేక చట్టం ప్రకారం సంబంధిత వ్యక్తులపై రూ.20వేల జరిమానా రెండోసారి అయితే రూ.50 వేల జరిమానాను విధించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు రెండేళ్ల జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

8 మంది బాలకార్మికులను గుర్తించిన ఆపరేషన్ ముస్కాన్ టీం..
ఆపరేషన్ ముస్కాన్-5 బృందం సభ్యులు మంగళవారం ధన్వాడ మండలంలో గొర్రెల కాపరులుగా పనిచేస్తున్న నలుగురిని గుర్తించారు. అలాగే మరికల్ మండలంలో మెకానిక్‌గా పనిచేస్తున్న మరో నలుగురిని పట్టుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. వీరిని స్టేట్‌హోంకు తరలించిన్నట్లు ఆమె పేర్కొన్నారు. చైల్డ్ వెల్పేర్ కమిటీ ద్వారా విచారణ చేసి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఎస్పీ వెల్లడించారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles