వడ్డీ వ్యాపారాలు ఢమాల్‌

Wed,June 19, 2019 01:39 AM

-అన్నదాతకు అండగా ‘రైతు బంధు’
-వడ్డీ వ్యాపారులపై పెట్టుబడి సాయం ప్రభావం
-అప్పులు తీసుకునేందుకు ముందుకురాని రైతులు
-నడిగడ్డలో ఏటా రూ.250 కోట్లకు పైగానే వ్యాపారం
-1,44,445 మంది రైతులకీ రూ.223.27 కోట్లు మంజూరు
-90,862 మంది రైతుల అకౌంట్ల సేకరణ
-46,952 మంది రైతులకు రూ.53కోట్ల 70లక్షలు జమ
జోగుళాంబ గద్వాల నమస్తేతెలంగాణ ప్రతినిధి : సన్న,చిన్నకారు పేద రైతులే లక్ష్యంగా వడ్డీ వ్యాపారాలు కొనసాగేవి. ప్రతి ఏడాది వానాకాలం పంటల సీజన్‌లో పేద రైతులు తమకు తెలిసిన వడ్డీ వ్యాపారి దగ్గరకు, లేదా ధాన్యం వ్యాపారుల దగ్గరకు వెళ్లి పంటపెట్టుబడుల కో సం డబ్బును అప్పుగా తీసుకునేవారు. ఈ పద్ధతి దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తుంది. పంట చేతికి అందాక తాము అప్పు తెచ్చుకున్న ధా న్యం వ్యాపారికే ఆ పంటను అమ్ముతారు. ఆ వ్యాపారి వడ్డీకి డబ్బులు తీసుకున్న రోజు నుంచి పంటను పండించి అమ్మకానికి తీసుకువచ్చిన రోజు వరకు లెక్కగట్టి పంటకు రావల్సిన డబ్బులోం చి తీసుకుంటారు. ఇక మిగిలిన కాస్త డబ్బులను రైతులకు అందజేస్తారు. ఆరుగాళం కష్టపడి పంట పండించిన రైతులకు అసలు, వడ్డీ డబ్బులు అన్నిపోగా చివరకు తృణమో ఫలమో చేతికి అందేవి. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం లాభాసాటిగా లేదని నష్టాలు చవిచూస్తున్నామని అభిప్రాయానికి వచ్చిన రైతు లు వ్యవసాయం మానేసి పట్టణ ప్రాం తాలకు వలసలు వెళ్లడం ప్రారంభించా రు. రైతును అన్ని విధాలుగా ఆదుకోవాలని సంకల్పించిన సీఎం కేసీఆర్‌ రైతుబంధు పథకం ద్వారా పంటపెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించారు. రైతుబంధు పథకం ద్వారా గతేడాది ఎకరాకు రూ.4వేలు అందించిన ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.5వేలను పంట పెట్టుబడిగా అందించారు.

రైతుల కష్టాలు తీర్చిన సీఎం కేసీఆర్‌
రైతులందరూ పట్టణ ప్రాంతాలకు వలసలు వెళ్లడంతో వ్యవసాయం చేసే వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది. ఈ పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని గట్టెక్కించడానికి సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రైతుబంధు పథకం అమ లు చేసి రైతులను అప్పల బాధల నుం చి ప్రభుత్వం విముక్తి చేసింది. పథకం ప్రారంభంలో గతేడాది ప్రతి ఎకరాకు రూ.4వేలు పంట పెట్టుబడి సాయంగా అందించగా ఈ ఏడాది ఎకరాకు రూ.5 వేలను అందించారు. గతేడాది జిల్లాలోని 1లక్షా 25,202 మంది రై తుల కు ఈ పథకం ద్వారా రూ.170.3 కో ట్లను ప్రభుత్వం చెక్కుల ద్వారా అం దించింది. ఈ ఏడాది ఈ సీజన్‌లో 1,44,445 మంది రైతులకు రూ.223 కోట్ల 27లక్షలను మంజూరు చేశారు. వీటిలో 90,862 మంది రైతుల బ్యాం క్‌ ఖాతాలను వ్యవసాయాధికారులు సేకరించారు. ఈ సేకరించిన జాబితా ప్రకారం విడతల వారిగా రైతులకు నేరుగా అకౌంట్లలో ఎకరాకు రూ.5వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని జ మ చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 46,952 మంది రైతులకు రూ.53 కోట్ల 70లక్షలు అకౌంట్లలో ఆన్‌లైన్‌ ద్వారా జమ చేశారు. ప్రభుత్వ పంట పెట్టుబడిసాయం అందించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి సారి అప్పుల కోసం వడ్డీ వ్యాపారస్తుల ఇళ్లచుట్టూ తిరిగే రైతులు ప్రస్తుతం అ ప్పుల కోసం ఎవరి ముందు చేయిచాచి అడగడం లేదు. ప్రతి రైతూ కూడా ఆత్మగౌరవంతో వ్యవసాయం చేసుకునే పరి స్థితులు ఏర్పడ్డాయి. ఈ ప్రభావంతో వడ్డీకి అప్పులు ఇచ్చే వ్యాపారులు దివాలా తీస్తున్నారు.

చతికిలపడ్డా వడ్డ్డీ వ్యాపారులు
రైతుబంధు పథకం ద్వారా తొలకరి ముందుగానే పంట పెటుబడి సాయం రైతులకు అందింది. దీంతో ఏ ఒక్కరైతు కూడా పంట పెట్టుబడుల కోసం అప్పు లు చేసేందుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం లేదు. ఎలాంటి వడ్డీ లేకుం డా ప్రభుత్వమే గ్రాంట్‌గా మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేకుండా పెట్టుబడులకు బడ్డులు అందించింది. దీంతో వడ్డీ వ్యాపారుల పూర్తిగా దివాలా తీశారు. సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని అధిక వడ్డీలకు డబ్బులను ఇచ్చే వ్యాపా రులు ఈ సారి వడ్డీని చాలా వరకు తగ్గించి అ ప్పులు ఇచ్చేందుకు సిద్ధమ య్యారు. అయినా కూడా రైతులు అప్పులు తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో 1,44,445 మంది రైతులున్నారు. వీరిలో దాదాపు 95శాతం మంది సన్న,చిన్నకారు రైతులే ఉన్నా రు. నడిగడ్డలో ఈ ఏడాది 3,63,085 ఎకరాల్లో పంటను సాగుచేయొచ్చని అధికారులు వానాకాలం పంటల అం చనా వేశారు. ప్రతి సన్న, చిన్నకారు రైతులకు కనీసం రూ.10వేలు వరకు పెట్టుబడి కోసం అవసరం అవుతున్నా యి. ఈ డబ్బుల కోసం గతంలో రైతు లు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేవా రు. నూటికి రూ.3 నుంచి 5 వరకు వడ్డీ వరకు వ్యాపారుల దగ్గర రైతులు అప్పుగా తెచ్చుకునేవారు. ఈ లెక్కన ప్రతి ఏడాది జిల్లాలో రూ.250 కోట్లపై గానే రైతుల ద్వారా వడ్డీ వ్యాపారాలు కొనసాగేవి. ఈ ఏడాది ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పేద రైతులకు కావల్సిన పెట్టుబడులు ప్రభుత్వమే అందించడంతో అప్పులు లేకుండా వ్యవసాయం ప్రారంభమవుతుంది.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles