రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం

Wed,June 19, 2019 01:35 AM

-స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ విడుదల చేసిన ఎస్పీ లక్ష్మీనాయక్‌
గద్వాల అర్బన్‌ : రోడ్డు ప్రమాదాల నివారణే తమ ధ్యేయమని ఎస్పీ లక్ష్మీనాయక్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్ర సమీపంలోని గద్వాల రూరల్‌ పోలిస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన పాల్గొని స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు వాటిని అమలు చేస్తున్నామని తెలిపారు. అతివేగంగా వెళ్లడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. ఈ ప్రమాదాల్లో తప్పు చేయని వారు, తప్పు చేసిన వారు ఇద్దరూ ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. వాహనాలు అతివేగాన్ని అదుపు చేయడానికి నగర శివారులో అత్యాధునిక పరిజ్ఞాణంతో చేయబడిన స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ను ఇప్పుడు మన జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారి, గ్రామీణ ప్రాంతాలలో ఉపయోగించడం జరుగుతుందని తెలిపారు. ఈ స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ దాదాపు 1 కిలో మీటర్‌ దూరంలో అతివేగంగా వస్తున్న వాహనాన్ని టార్గెట్‌ చేసి, వాహనం ఫొటో తీసి వాహన వేగాన్ని లెక్కిస్తుంది.

వేగం పరిమితికి మించి ఉంటే ఫొటోతో పాటు వాహన నెంబర్‌ ప్లేట్‌ వివరాలు అటోమెటిక్‌గా సర్వర్‌కు వెళ్తాయి. వెంటనే చలాన్‌ జనరేటై వాహన యజమానికి వాహనం నడుపుతూ 200 మీటర్ల దూరం వెళ్లెలోపు ఫోనుకు మెసేజ్‌ రూపంలో చలాన్‌ వెళ్తుందన్నారు. అతివేగంగా వెళ్లే వాహనాలకు 1,400 రూ.చలాన్‌ ద్వారా జరిమానా విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు చలాన్‌ రూపంలో విధించిన జరిమానా డబ్బులను పేటీఎం, ఈ సేవ, మీ సేవ ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇది కేవలం వాహన వేగాన్ని తగ్గించి, ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఉపయోగకరంగా ఉంటుందని భావించి అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఎస్పీ తెలిపారు. మూడు కంటే ఎక్కువ సార్లు చలాన్‌ పెండింగ్‌లో ఉన్న వాహనాలను సీజ్‌ చేస్తామన్నారు. స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ గురించి ప్రజలకు అవగాహన కార్యాక్రమలు చేపడుతామన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణ, గద్వాల డీఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌, సీఐ హన్మంత్‌, ఎస్‌ఐలు సత్యనారయణ, స్పీడ్‌ లేజర్‌ గన్స్‌ శిక్షకులు, పోలీస్‌ సిబ్బంది తదితరులు ఉన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles