ఉద్యోగం రాలేదని యువకుడు ఆత్మహత్య

Wed,June 19, 2019 01:34 AM

మరికల్‌ : ఉద్యోగం రాలేదని మనస్తాపానికి గురైన యువకుడు కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్న స ం ఘటన మండల పరిధిలోని మాధవ రం గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకరం పూర్తి వివరాలు ఇ లా ఉన్నాయి. మండల పరిధిలోని మాధవరం గ్రామనికి చెందిన బాలాంజనేయు లు(27) 2015 బీటెక్‌ సివిల్‌ ఇంజనీర్‌ చ దువును పూర్తి చేశాడు. నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం కోసం అన్వేషణ చేసినా ఉద్యోగం రాకపోవడంతో శనివారం రాత్రి అందరూ ఇంట్లో నిద్రిస్తుండగా ఇంటి బ యట ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నాడు. మంటలు తాళలేక కేకలు వేయడంతో నిద్రలోంచి తేరుకున్న కుటుంబసభ్యులు మంటలను ఆర్పి, చికిత్స ని మిత్తం హైద్రాబాద్‌ లోని ఉస్మానియ దవాఖానకు తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బాలాంజనేయులు మ ంగళవారం ఉదయం మృతి చెందినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్త్తున్నట్లు మరికల్‌ ఏఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు. అందరితో కలిసుండే బాలాంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles