రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Wed,June 19, 2019 01:34 AM

ఇటిక్యాల: మండలంలోని 44వ జాతీయ రహదారిపై కొట్టం ఇంజనీరింగ్‌ కళాశాల సమీపంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరొకరికి గాయాలైనట్లు ఇటిక్యాల ఎస్‌ఐ రాజు తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. కడప జిల్లా రైల్వేకొడూర్‌కు చెందిన అబ్దుల్‌కలామ్‌, నవాబ్‌, వెంకటసుబ్బయ్యలు మామిడికాయల వ్యాపారి వద్ద కూలీలుగా ఉంటూ డీసీఎంతో మామిడికాయలను రాయిచూర్‌కు తరలించేవారు. అయిజ రోడ్డుకు మరమ్మతులు జరుగుతుండడంతో వారు మామిడికాయలను మినీ డీసీఎంలో గద్వాల గుండా రాయిచూర్‌కు వెళ్తున్న సమయంలో డీసీఎం కొట్టం కళాశాల దగ్గరకు చేరుకోగానే వాహనం వెనుక టైర్‌ పంక్చర్‌ అయ్యింది. డ్రైవర్‌ వెంకటసుబ్బయ్య టైర్‌ మారుస్తుండగా అబ్దుల్‌కలామ్‌, నవాబ్‌ లు జాతీయ రహదారివైపు (వాహానాలు వెళ్లేవైపు) నిలిచిఉన్నారు. రహదారిపై అతివేగంగా వెళ్తున్న భారీ వాహనం రోడ్డు ప్రక్కన నిల్చున్న వీరిని వెనుక నుంచి ఢీకొట్టడంతో అబ్దుల్‌కలామ్‌ (45), నవాబ్‌ (42) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకటసుబ్బయ్య(19) కు గాయాలయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles