పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య

Wed,June 19, 2019 01:34 AM

-రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్య
- ఇటిక్యాలపాడు వాసులుగా గుర్తించిన పోలీసులు
మానవపాడు : ఇద్దరి కులాలు వేరుకావడంతో ఇంట్లోవారు పెళ్లికి ఒప్పుకోరని మనస్థాపానికి గురైన ప్రేమజంట రైలు పట్టాలపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన ఘటన మంగళవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు గ్రామానికి చెందిన బోయ లోకేష్‌ (26) ట్రాక్టర్‌ డ్రైవర్‌గా గ్రామంలోనే పనిచేస్తూ జీవిస్తున్నాడు. అదే గ్రామంలో ఎస్సీ వర్గానికి చెందిన సంతోషమ్మ అలియాస్‌(కస్తూరి) (19) పదో తరగతి వరకు చదువుకుని ఇంట్లోనే ఉంటోంది. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించు కుంటున్నారు. వీరి ప్రేవ వ్యవహారం ఇరు కుటుంబాల వారికి తెలియకపోవడంతో వారి ప్రేమాయణం సాఫీగా కొనసాగింది. 6 నెలల క్రితం కస్తూరి బంధువులకు విషయం తెలియడంతో అబ్బాయి తరుపు బంధువులకు సమాచారం ఇచ్చినా లోకేష్‌ కుటుంబీకులు అతడిని ఏమీ అనలేదు.

దీంతో అమ్మాయిని గ్రామంలో ఉంచకుండా హైదరాబాదులోని తమ బంధువుల ఇంటి వద్ద వదిలిపెట్టారు. వేసవికాలం సెలవులు రావడంతో కస్తూరి తమ సొంత ఊరికి వచ్చింది. సోమవా రం అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత ఇద్దరూ మోటార్‌ సైకిల్‌ తీసుకుని గ్రామం దాటి బయటకు వెళ్లారు. వాహన శబ్ధానికి నిద్రలేచిన అమ్మా యి తల్లిదండ్రులు పరిశీలించగా అమ్మాయి కనిపించలే దు. మానవపాడు మండ లం పోతులపాడు శివారు లో ఉదయం పంట పొలాల కు వెళ్లిన కొందరు వ్యక్తులు పట్టాలపై పడిఉన్న శవాలను చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మహత్య సంఘటన వెలుగులోకి వచ్చింది. లో కేష్‌, కస్తూరిల తల్లిదండ్రులు మాత్రం వారు ప్రేమించుకున్న విషయం తమకు తెలియదని బోరున విలపించారు. ప్రేమజంట మరణించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. రైల్వే సిబ్బంది సమాచారం మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ రామక్రిష్ణలు తెలిపారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles