మ్రార్గం..సుగమం

Tue,June 18, 2019 03:12 AM

-సత్సంబంధాలు
-త్వరలో సోమశిల- సిద్దేశ్వరం బ్రిడ్జికి మోక్షం
-హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి పాలమూరు వాసులు
మహబూబ్‌ నగర్‌ నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి:పొరుగు రాష్ర్టాలతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటే పలు సమస్యల పరిష్కారానికి దిక్సూచి అవుతుందని సీఎం కేసీఆర్‌ నిరూపించారు. మహారాష్ట్రతో చక్కని సంబంధాలు, దౌత్యం నెరపడం ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి ఉన్న అడ్డంకులన్నిటినీ తొలగించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తెలంగాణకు మరో ఫ్రెండ్లీ స్టేట్‌ లభించింది. ఏపీ సీఎం జగన్‌ మన రాష్ట్రంతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబిస్తున్నారు. రెండు తెలుగు రాష్ర్టాలు చక్కని సంబంధాలతో ముందుకు పోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన పలు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని జిల్లా వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ర్టాల్లోని ప్రభుత్వాలు స్నేహపూర్వకంగా ఉన్నందున ఇక అనేక ఏండ్లుగా పరిష్కారానికి నోచుకోని సమస్యలు ఇక వేగంగా పరిష్కరించబడతాయని ఆశీస్తున్నారు. ఫ్రెండ్లీ స్టేట్స్‌గా ఉన్నందును శతాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న సోమశిల- సిద్దేశ్వరం వంతెనకు మోక్షం వచ్చే అవకాశం కనిపిస్త్తుంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే తన ప్రయత్నాలు ప్రారంభించారు...

ఏపీలో జగన్‌ రాకతో...
2014లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేశారు. ప్రతి అడుగు కూడా తెలంగాణకు వ్యతిరేకంగానే వేశారు చంద్రబాబు. పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలోనూ చంద్రబాబు కుట్రలు చేశారు. ఏ విషయంలోనూ తెలంగాణకు సహకరించలేదు. దీంతో రెండు రాష్ర్టాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అక్కడి ప్రజలు దారుణంగా దెబ్బగొట్టారు. అఖండ మెజార్టీతో వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యారు. జగన్‌ సీఎం అవ్వడంతో రెండు రాష్ర్టాల మధ్య ఇన్నాళ్లు దెబ్బతిని ఉన్న సంబంధాలు ఒక్కసారిగా మెరుగయ్యాయి. ఇన్నాళ్లు ఉప్పు నిప్పుగా ఉన్న రాష్ర్టాలు ఇప్పుడు ఫ్రెండ్లీ స్టేట్స్‌ అయ్యాయి. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న సోమశిల- సిద్దేశ్వరం బ్రిడ్జి, నాగులదిన్నె బ్రిడ్జి, ఆలంపూర్‌- నందికొట్కూరు మధ్య అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తి అయితే రాకపోకలకు ఎంతో వెసులుబాటు కలుగుతుంది.

సత్సంబంధాలు లేక...
దశాబ్దాలుగా సోమశిల- సిద్దేశ్వరం వంతెన కోసం రెండు ప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏపీలోని కర్నూలు జిల్లా ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గాలు, తెలంగాణలోని నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌, నాగర్‌ కర్నూలు, వనపర్తి జిల్లా ప్రజలకు బంధుత్వాలున్నాయి. కొల్లాపూర్‌ మండలం సింగోటంలో జరిగే లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవానికి రాయలసీమ నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. 2007, జనవరి 18వ తేదీన సింగోటం రథోత్సవానికి నందికొట్కూరు తాలుకా నెహ్రూనగర్‌ నుంచి 61 మంది నాటుపడవలో బయలుదేరారు. వారంతా నాటు పడవ బోల్తా పడటంతో జల సమాధి అయ్యారు. సామర్థ్యానికి మించి ప్రయాణం చేయడం వల్లే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై స్పందించిన అప్పటి సీఎం రాజశేఖర్‌ రెడ్డి 2009లో వంతెన నిర్మాణానికి శిలాఫలకం వేశారు. 2012లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి వంతెన నిర్మాణానికి అంచనాలు పెంచారు. 2014లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ ఈ వంతెన కోసం ప్రత్యేకంగా రూ.193 కోట్లు కేటాయించారు. వంతెన పూర్తయితే ఈ ప్రాంతం ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.

నాగులదిన్నె వెతలు...
అక్టోబర్‌ 2, 2009... గాంధీ జయంతి కానీ అదే రోజు నడిగడ్డ వరదలతో అల్లాడిపోయింది. కృష్ణ, తుంగభద్ర నదులు ఉగ్రరూపం దాల్చడంతో రోజుల తరబడి గ్రామాలు, పట్టణ పాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ, రాయలసీమ ప్రజలకు కలిపే నాగులదిన్నె వంతెన తుంగభద్ర ఉగ్రరూపానికి నేలమట్టం అయ్యింది. 27 పిల్లర్లతో నాగల్‌దిన్నె వంతెన పనులను ప్రారంభించిన సిండికేట్‌ కాంటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ... నదిలో పిల్లర్లను ఏర్పాటు చేసి, పిల్లర్లపై గడ్డర్లను ఏర్పాటు చేస్తున్నారు. పనులు చేపట్టిన ఏపీ ప్రభుత్వం, తెలంగాణతో ఈ సమస్యపై చర్చిస్తే వెంటనే పరిష్కారం ఏర్పడుతుందని తెలుస్తోంది. సమస్య జఠిలంగా మారంతో బ్రిడ్జి నిర్మాణం పూర్తికాక పోవడంతో నేటికి ఇరు రాష్ర్టాల ప్రజలు పుట్టిలలో ప్రయాణం భయం భయంగా ప్రయాణిస్తున్నారు.

అలంపూరు అంతులేని కథ...
అలంపూర్‌ నియోజకవర్గంలోని ర్యాలంపాడు, సుల్తానాపూర్‌, జిల్లేడుపాడు గ్రామాలు తుంగభద్ర నదికి ఆవల వైపున ఏపీ సరిహద్దుల్లో ఉంటాయి. అయితే అక్కడికి చేరుకునేందుకు తుంగభద్రలో పుట్టీ ప్రయాణమే గతి. ఈ పరిస్థితి నుంచి ఈ గ్రామాల ప్రజలకు విముక్తి కల్పించేందుకు, అలంపూర్‌, శ్రీశైలం పుణ్యక్షేత్రాల మధ్య రవాణా సదుపాయాలను మెరుగుపర్చేందుకు సమైఖ్య రాష్ట్రంలో 2004లో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పడుతూ లేస్తూ వచ్చిన కాంట్రాక్టర్‌.. ఇటీవలే బ్రిడ్జి పనులు సుమారుగా పూర్తి చేశారు. ఈ బ్రిడ్జి పూర్తయితే హైదరాబాద్‌ నుంచి కర్నూలు వెళ్లకుండానే నేరుగా నందికొట్కూరు, ఆత్మకూరు చేరుకోవచ్చు. ఆలంపూర్‌ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి దగ్గరి మార్గం ఏర్పడుతుంది. రెండు శక్తిపీఠాలైన ఆలంపూర్‌, శ్రీశైలం మధ్య రాకపోకలు ప్రారంభమవుతాయి.

నాగల్‌దిన్నె వంతెన పనుల పూర్తికి చర్యలు ..
నాగల్‌దిన్నె వంతెన పనులు త్వరగా పూర్తి చేసేందుకు సీఎం కేసీఆ చర్చించేందు సమా సమయం చూసుకుని సీఎం కేసీ ఆర్‌తో చర్చించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని సం ప్రదిం నాగల్‌ వంతెనతోపాటు పనుల పూర్తి చర్యలు తీసుకుంటాం.ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతాం. ఎమ్మెల్యే, అలంపూర్‌
త్వరలో వంతెన పనులకు భూమి పూజ
సోమశిల- సిద్దేశ్వరం వంతెన కొల్లాపూర్‌ ప్రజల చిరకాల వాంఛ. గత పాలకులు ఈ వంతెన నిర్మా విషయంలో ప్రజలను తప్పుదారి పట్టించారు. ఇప్పటికే ఈ బ్రిడ్జి నిర్మాణం అంశంపై ముఖ్య మంత్రికి వినతిపత్రం అందిం త్వరలో ఈ వం తెన నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం ఉంటుంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రావడంతో అంతర్‌ రాష్ట్ర సమ వెంటనే పరిష్కారం అవుతాయి. సాధ్య మైనంత త్వరగా ఈ పనులు చేపట్టేలా నా వంతు ప్రయ త్నం చేస్తాను.

హర్షవర్ధన్‌ రెడ్డి, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే
బిడ్జి నిర్మాణానికి మా సహకారం ఉంటుంది
సోమశిల- సిద్దేశ్వరం వంతెన నిర్మాణమైతే రెండు ప్రాంతాల ప్రజల మధ్య రాకపోకలకు అవ ఏర్పడుతుంది. తెలంగాణ ప్రభుత్వానికి మా సహకారం ఎప్ప ఉంటుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్‌ నుంచి ఆత్మకూరు, నంద్యాల ప్రాంతాలతో పాటు రాయలసీమలోని మరికొన్ని పట్టణాలు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు దగ్గరి మార్గం అవుతుంది.బ్రిడ్జి నిర్మాణం త్వరగా చేపట్టాలని మేం కోరుకుంటున్నాం.
-శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే

92
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles