కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు

Tue,June 18, 2019 12:55 AM

-చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్లవచ్చు
-తెలంగాణ గురుకుల పాఠశాలలు దేశానికి ఆదర్శం
-రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌
మహబూబ్‌నగర్‌, తెలంగాణ చౌరస్తా : కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. సోమవారం మండలంలోని ధర్మాపూర్‌ గ్రామంలో మన్యంకొండ బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చదువుతోనే ఉన్నత స్థానానికి వెళ్లవచ్చని, మహిళల చదువులకు మూల కారణం జ్యోతిబాయి ఫూలే మొట్టమొదట ఉపాధ్యాయురాలిగా ఆమె మహిళలకు అక్షరాలు నేర్పించారని, ఆమెను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఒకప్పుడు హాస్టళ్లలో చదవాలంటే పిల్లలు పారిపోయే వారని హాస్టళ్లలో వసతులు లేక చాలిచాలని తిండితో గతిలేక హాస్టళ్లలో ఉండి చదువుకునే వారని ఇంటి వద్ద చదివించే స్థోమత లేని విద్యార్థులు కష్టపడి చదువుకునే వారని గుర్తు చేశారు.

నేడు తెలంగాణ ఏర్పాడ్డాక రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా తామే హాస్టల్‌ విద్యార్థులకు ఎలాంటి భోజనం అందించాలని మెనూను తయారు చేశారని, నెలకు రూ.2సార్లు మేక మాంసం, నాలుగుసా ర్లు కోడి మాంసం, రోజు గు డ్డు, పప్పు, సాంబర్‌, ఉద యం అల్పాహరం, పండ్లు, రాగి జావా వంటి ఎంతో నా ణ్యమైన భోజనాన్ని అందిస్తున్న ఘనత తెలంగాణ ప్ర భుత్వానికి దక్కుతుందన్నా రు. విద్యార్థులు చదువుతోపాటు స్పోర్ట్స్‌లో రాణించాలన్నారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయిలో గురుకుల విద్యార్థులు ఎంతో మం ది ఉన్నతస్థాయికి ఎదిగారని, కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని పేర్కొన్నారు. చదువు ఉంటేనే అన్నిరంగాల్లో అభివృద్ధి జరుగు తుందని విద్యార్థులు ప్రణాళికా బద్ధంగా చదివి తాము అనుకున్న లక్ష్యాలను చేరాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మార్కె ట్‌ కమిటీ చైర్మన్‌ ఆంజనేయులు, ఎంపీపీ సావి త్రి, సుధాశ్రీ, జెడ్పీటీసీ శ్రీదేవి, జెడ్పీ కోఆప్షన్‌ మెంబరు అల్లావుద్దీన్‌, రైతు సమన్వయ సమితి డైరెక్టర్‌ మల్లు నర్సింహరెడ్డి, ఎంపీటీసీలు, మణె మ్మ, రవీందర్‌రెడ్డి, బీసీ గురుకుల ప్రిన్సిపాల్‌ కృష్ణకుమార్‌,కోఆర్డినేటర్‌, సర్పంచులు యుగందర్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles