నేటి బాలలే రేపటి దేశ సంపద

Tue,June 18, 2019 12:55 AM

-ఐదేళ్లలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేశాం
-అన్నిరకాల మౌలిక వసతుల కల్పన
-మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
-నాగవరంలో బీసీ బాలుర గురుకులాల ప్రారంభం
వనపర్తి రూరల్‌ : తెలంగాణలోని ప్రభుత్వ గురుకుల పాఠశాలలోని బాలలు రేపటి దేశ నవ నిర్మాణంలో ముఖ్యులుగా కానున్నరని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని నాగవరం లో నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ బాలుర గు రుకుల పాఠశాల శిలాఫలాకాన్ని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు జేసీ వేణుగోపాల్‌, నూతన జెడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్‌రావు తదితరులు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ప్రాం తంలోని విద్య వ్యవస్థను భ్రష్టుపట్టించారన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఏర్పాటు అనంతరం రాష్ట్రం లో కేజీ నుంచి పీజీ విద్యను అందరికి సమానంగా అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ విద్యలో స మూల మార్పులను తీసుకొచ్చి రాష్ట్రంలో గురుకుల వ్యవస్థను పటిష్ట పర్చిరాని తెలిపారు. రెండు సంవత్సరాలలో అనేక వర్గాల వారిగా వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాల వారికి ఉచితంగా నాణ్యమైన విద్యతో పాటు పౌష్టికాహారం అందిస్తుందని తెలిపారు. సమాజంలో విద్యపై అసమానతలు తొలగాలంటే చదువు ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. అంతకుముందు జేసీ వేణుగోపాల్‌రావు, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధ్రర్‌రావు, బీసీ గురుకుల పాఠశాలల కన్వీనర్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి ప్రభుత్వం పేద బడుగు బ లహీన వర్గాల విద్యార్థులకోసం గు రుకులాల ద్వారా అనేక వసతులను కల్పిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి మున్సిపాల్‌ చైర్మన్‌ రమేష్‌ గౌడ్‌, ఎంపీపీ శంకర్‌నాయక్‌, నూతన ఎంపీపీ కిచ్చారెడ్డి, బీసీ వేల్ఫేర్‌ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర డబుల్‌ బెడ్‌రూంల హౌసింగ్‌ చైర్మన్‌ భూరెడ్డి, గొ ర్రెల కాపరుల సంఘం జిల్లా చైర్మన్‌ కురుమూర్తి యాదవ్‌, ఎంపీటీసీ నారమ్మ, పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్‌ బొజ్జ య్య, ఆయా గ్రామాల టీఆర్‌ఎస్‌ నాయకులు, వనపర్తి వార్డు కౌన్సిలర్స్‌, ప్రజలు, గురుకుల పాఠశాల సిబ్బం ది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles