ప్రభుత్వ బడుల్లోనే క్రమశిక్షణ, నైపుణ్యత

Tue,June 18, 2019 12:55 AM

కేటీదొడి: మండలంలోని నందిన్నెలో సోమవారం నిర్వహించిన బడిబాట, సామూహిక అక్షరాభ్యాసంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణ నైపుణ్యత కలిగి ఉంటారని అన్నారు. మన ప్రాంతం అక్షరాస్యతలో వెనుకబడిన ప్రాంతమని ఎన్నోఏళ్లుగా చెప్పుకుంటున్నా మని, అది ఇక చెప్పుకునే అవసరం లేకుండా చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉంచిందని ప్రతి ఒక్క తల్లిదండ్రులు విద్యార్థుల చదువు విషయంలో ఏలాంటి అనుమనాలు పెట్టుకోకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్చించాలన్నారు. అనంతరం హెచ్‌ఎం మహేష్‌ మాట్లాడుతూ పాఠశాలలో వి ద్యార్థులకు సరిపడ తరగతుల గదులు లేవని, గదులు తక్కువగా ఉండటంతో డిజిటల్‌ క్లాసులకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి, సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ బండారి భా స్కర్‌, కేటీదొడ్డి, మల్దకల్‌ జెడ్పీటీసీలు రాజశేఖర్‌, ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీలు రాజారెడ్డి, విజయ్‌ కుమార్‌, ఎంఈవో సురేష్‌, హెచ్‌ఎంలు మహేశ్‌, హంపయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, ఆగస్టీన్‌, సర్పం చ్‌లు చిన్నబీమరాయుడు తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles