ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య

Tue,June 18, 2019 12:53 AM

- గద్వాల మండలంలోని పరుమాల స్టేజీ వద్ద గురుకులాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల
గద్వాల, నమస్తేతెలంగాణ/మల్దకల్‌: ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లాలో నియోజకవర్గానికి ఒకటికి చొప్పున రెండుగురుకుల పాఠశాలలు మంజూరు కాగా సోమవారం గద్వాల మండలంలోని పరుమాల స్టేజీ వద్ద ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలను ఉమ్మడి జిల్లా పరిషత్‌ బండారి భాస్కర్‌తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ విద్యాపరంగా వెనుకబడిన జోగులాంబ గద్వాల జిల్లాకు సీఎం కేసీఆర్‌ విద్యా పరంగా ఏది అడిగినా సానుకూలంగా మంజూరు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే ఈ రోజు అలంపూర్‌లో ఒక పాఠశాలను అక్కడి ఎమ్మెల్యే అబ్రహం, ప్రారంభించారని తెలిపారు. త్వరలో ఇక్కడ ఒక గురుకుల పాఠశాలతో పాటు త్వరలోనే ఒక ఎస్టీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవం చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని అందులో భాగంగానే పేద తల్లిదండ్రులకు వారి పిల్లలను ఉన్నత విద్యను ఉచితంగా చదివించడానికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 544గురుకుల పాఠశాలలు ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో గురుకులాల్లో చదువుకున్న 162మంది విద్యార్థులు సిట్‌లో ర్యాంకులు సాధించారని దీన్ని బట్టి గురుకులాల్లో విద్యఎంత మంచిగా ఉందో తెలుసు కోవచ్చన్నారు. గురుకులాల్లో సీట్లు పొందడానికి ప్రవేశ పరీక్షలకు కోచింగ్‌ ఇప్పించి సీట్లు పొందుతున్నారని తెలిపారు. అనంతరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బండారి భాస్కర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఏప్రభుత్వం చేయని విధంగా ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 119గురుకులాలను ప్రారంభించినట్లు తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిణి ఇందిర మాట్లాడుతూ ఈ గురుకులాల్లో 5,6,7వ తరగతిలో ప్రవేశాలు కల్పించడం జరిగిందని, ఈ పాఠశాలల్లో నలుమూలల నుంచి విద్యార్థులు ఎంపికై రావడం జరిగిందన్నారు. వారికి వసతి గృహ వసతితో పాటు భోజనం, పుస్తకాలు, దుస్తులు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కేశవ్‌,ఎంపీపీలు సుభాన్‌, రాజారెడ్డి, విజయ్‌కుమార్‌, ఎంఈవో ప్రతాప్‌రెడ్డి నేతలు రమేష్‌, సత్యారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles