నర్వలో నోటరీ దుకాణం ప్రారంభం

Mon,June 17, 2019 03:21 AM

నర్వ : మండల కేంద్రంలో ఆదివారం దస్తావేజు దుకాణంను వైస్‌ఎంపీపీ వీణవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దస్తావేజులకు సంబంధించి ఏదేని పని నిమిత్తం మండల ప్రజలు ఆత్మకూర్, మక్తల్ పట్టణాలకు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. వీటిని అందుబాటులోకి తెచ్చిన దుకాణ యజమానులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో నర్వ పట్టణ సర్పంచ్ పెద్దింటి సంద్యా అంజనేయులు, ఉప సర్పంచ్ నర్సింహరెడ్డి, ఆయా పార్టీల నాయకులు, పాల్గొన్నారు.
చెక్‌డ్యాంల నిర్మాణానికి సర్వేచెక్‌డ్యాంల నిర్మాణానికి సర్వేదేవరకద్ర రూరల్: మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టు క్రింద పారే పెద్దవాగుకు చెక్‌డ్యాంలు నార్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా, డీఈ చందులాల్, ఏఈ శ్రీనివాస్‌గౌడ్‌లు స్థలాన్ని పరిశీలించి సర్వే చేపట్టారు. పెద్దవాగుకు అనుబంధ గ్రామాలైన చిన్నరాజమూర్‌కు 2, పెద్దరాజమూర్‌కు 1, బస్వాపూర్‌కు1, గూరకొండకు1 చెక్‌డ్యాంల చొప్పున నిర్మించేందుకు ఉత్తర్వులు వచ్చాయని అదికారులు తెలిపారు. అదేవిధంగా దేవరకద్ర నుంచి కింది గ్రామాలు జీన్గరాల, డోకూర్‌కు 2 డ్యాంల చొప్పున నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో చెక్‌డ్యాం 160 మీటర్లకుగాను 5.6 కోట్లు వ్యయం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులు త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌యాదవ్, బస్వాపూర్ సర్పంచ్ హన్మంతు, నాయకులు సత్యంసాగర్ తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles