నడిగడ్డకు కొత్త గురుకులాలు

Sun,June 16, 2019 02:22 AM

-జిల్లాలో 2 బీసీ గురుకులాలుప్రారంభించేందుకు సన్నాహాలు
-ఈ నెల 17న గురుకులపాఠశాలల ప్రారంభం
-5,6,7 తరగతుల ప్రారంభం
-ప్రతి తరగతిలో 80 మందికిఅవకాశం
-2 పాఠశాలల్లో 480 మందివిద్యార్థులకు అవకాశం
-నాలుగుకు చేరిన బీసీ గురుకులాలు
అయిజ : జిల్లాలకు 2019-20 ఏడాదికి గాను సర్కారు 2 బీసీ గురుకుల పా ఠశాలలను మంజూరు చేసింది. ఈ నెల 17న గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కంటే ముందు జోగుళాంబ గద్వాల జి ల్లాలో ఒక్క బీసీ గురుకుల పాఠశాల మంజూరుకాలేదు. సీఎంగా కేసీఆర్‌ బా ధ్యతలు చేపట్టిన తర్వాత జోగుళాంబ గద్వాల జిల్లా లో కేటీదొడ్డి, పుల్లూరు గ్రామాలలో గురుకుల పాఠశాలలను కొత్తగా ఏర్పాటు చేశారు. 2019-20 ఏడాదికి గాను జోగుళాంబ గద్వాల జి ల్లాలో మరో 2 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పేందుకు మహాత్మా జ్యో తి బాపూలే గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రత్యేక దృష్టి సారించింది. జో గుళాంబ గద్వాల జిల్లాలో 2 బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పేందుకు అ ధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

జి ల్లాలో మల్దకల్‌ మండలం, బిజ్జారం గ్రామం, వడ్డెపల్లి మండలం, శాంతినగర్‌లో బీసీ గురుకుల పాఠశాలలను ప్రా రంభించి, 5,6,7 తరగతుల విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించేందుకు ఎంట్రెన్స్‌ నిర్వహించి అడ్మిషన్లు సైతం పూర్తి చేశా రు. ఒక్కో తరగతిలో రెండు సెక్షన్లు ఏ ర్పాటు చేసి 80 మందికి ప్రవేశం కల్పిం చి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన చేయడంతోపాటు పౌష్టికాహారంతోపా టు కార్పోరేట్‌ స్థాయి విద్యను అందించనున్నారు. దీంతో జోగుళాంబ గద్వా ల జిల్లాలోని 2 బీసీ గురుకులాల్లో 480 మంది బీసీ విద్యార్థులకు గురుకులాల్లో అవకాశం కల్పించింది. గత ఏఫ్రిల్‌లో ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులకే రిజర్వేషన్‌ ప్రకారం పాఠశాలల్లో ప్రవే శం కల్పించారు. కొత్తగా మంజూరైన గురుకులాలను ఈ నెల 17న తాత్కాలిక భవనాలలో ఏర్పాటు చేసి స్థానిక ఎమ్మెల్యేలు, గురు కులాల సొసైటీ అధికారులు, బీసీ వేల్ఫేర్‌ అధికారులతో ప్రారంభింపజే సేందుకు స ర్కారు, అధికారులు ఏర్పాట్లు చేస్తున్నా రు. గురుకులాలపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుండటంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మెరుగైన విద్యనందించడమే లక్ష్యం
రాష్ట్రంలోని వెనుకబడిన తరగతుల వి ద్యార్థులకు మెరుగైన విద్యను అం దిం చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రా ష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకుల పాఠశాలలను పెద్ద ఎత్తున ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 142 గురుకుల పా ఠశాలలు మహాత్మా జ్యోతిబాపూలే వి ద్యాలయాల సొసైటీ ఆధ్వర్యంలో న డుస్తుండగా, 2019-20 ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా 119 పాఠశాలలను ప్రారంభించేందుకు సర్కారు చర్యలు తీసుకుంటుండగా, ఉమ్మడి జిల్లాలో మరో 12 గురుకుల పాఠశాలలను నెలకొల్పి పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న గురుకులాల్లో 5,6,7 తరగతుల విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఒక్కో తరగతిలో 80 మంది విద్యార్థులకు అడ్మిషన్‌ కల్పించేందుకు ఇప్పటికే ఎంట్రెన్స్‌ నిర్వహించింది. ఉమ్మడి జిల్లాలో 12 పాఠశాల ల్లో 2,880 మంది విద్యార్థులకు ప్ర వేశం కల్పించేందుకు మహాత్మా జ్యోతి బాపూలే బీసీ విద్యాలయాల సొసైటీ అ ధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా లో గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్‌ మండలం, బి జ్జారం గ్రామంలో బాలికలకు, అలంపూర్‌ నియోజకవర్గం శాంతినగర్‌లో బాలురకు ప్రవేశం క ల్పించారు. జోగుళాంబ గద్వాల జిల్లా లో 2017 ఏడాదిలో గద్వాల నియోజకవర్గంలోని కేటీదొడ్డిలో బాలురు, అలంపూర్‌ నియోజకవర్గంలోని పుల్లూరు లో బాలికల బీసీ గురుకుల పాఠశాలలను నెలకొల్పి వి ద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభు త్వం అందిస్తోంది. ప్రస్తుతం ఏర్పాటు చేయనున్న గురుకుల పాఠశాలలతో జోగుళాంబ గద్వాల జిల్లాలో బీసీ గురుకులాల సంఖ్య నాలుగుకు చేరింది.

ఇంగ్లీష మీడియంలోనే బోధన ..
మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకు ల విద్యాలయాల్లో ఇంగ్లీష్‌ మీడియం లో బోధన చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో నెలకొల్పనున్న కొత్త గురుకుల పాఠ శాలల్లో జూన్‌ 17 నుంచి తరగుతులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 2 గురుకుల పాఠశాలల్లో 5,6,7 తరగతులను ప్రారంభించి, ఒక్కో తరగతిలో 80 మందికి అడ్మిషన్‌ కల్పించనున్నారు. ఒ క్కో పాఠశాలను 240 మంది విద్యార్థులతో ప్రభుత్వం గురుకులాలను ప్రారంభించనుంది. ఇప్పటికే భవనాల ఎంపికను కలెక్టర్లు, గురుకులాల అధికారులు భవనాల గుర్తించారు.

తాత్కాలిక భవనాల ఎంపిక ..
జిల్లాకు 2019-20 ఏడాదికి మం జూరైన బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పా టు చేసేందుకు తాత్కాలిక భవనాలను గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్‌ మండలం, బిజ్జారం పాఠశాలను గ ద్వాల మండలం, పరుమాల సమీపంలోని ట్రినిటీ ప్రైవేటు పాఠశాలలో, అ లంపూర్‌ నియోజకవర్గంలోని వడ్డెపల్లి మండలం, శాంతినగర్‌ పాఠశాలను అ లంపూర్‌ చౌరస్తాలోని ప్రైవేటు భవనం లో పాఠశాలను ఏర్పాటు చేస్తున్నారు.

17న బీసీ గురుకుల ప్రారంభానికి చర్యలు
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 12 మహాత్మా జ్యోతి బాపూలే బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. జూన్‌ 17 నుంచి ఆయా నియో జకవర్గాల పరిధిలో పాఠశాలలను ప్రారంభించేందుకు కలెక్టర్ల ద్వారా భవనాలను గుర్తించాం. ప్రస్తుతం పాఠశాలల ఏర్పాటుకు అనువైన ప్రైవేటు భవనాలలో ఏ ర్పాటు చేస్తాం. కొత్త భవనాలు నిర్మించే వరకు అనువైన భవనాలలో తరగతులు ప్రారంభించడంతోపాటు వసతులను కల్పిస్తాం. ఈ నెల 17న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ప్రారంభించబోతున్నాం. అందుకు తగిన చర్యలు తీసుకున్నాం.
-లింగయ్య, బీసీ గురుకుల పాఠశాలల రీజినల్‌ కోఆర్డీనేటర్‌, మహబూబ్‌నగర్‌.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles