మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం

Sun,June 16, 2019 02:20 AM

-రూ. 64 లక్షల వ్యయంతో డ్రైనేజీ పనులు ప్రారంభం
-భూమిపూజ చేసిన ఎమ్మెల్యే డా.వీఎం అబ్రహం
అయిజ : అయిజ మున్సిపాలిటీ అభివృ ద్ధే లక్ష్యంగా పనులు వేగవంతం చేస్తున్న ట్లు అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం .అబ్రహం అన్నారు. అయిజ మున్సిపాలిటీలో రూ.64 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీలకు ఎమ్మెల్యే శనివారం భూమిపూజ చేశారు. పట్టణంలో మురుగునీటి పారుదలకు ఇబ్బందులు ఏర్పడుతుండటంతో డ్రైనేజీల ఏర్పాటు చేపట్టాలని పాలకవర్గం తీర్మాణించిందన్నారు. ఇళ్ల నుంచి వెలువడే మురుగునీటితో పాటు వర్షపునీరు రహదారులపైకి చేరడంతో ప్రజలు అవస్థలు పడుతుండటంతో డ్రైనేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తె లిపారు. పట్టణంలోని ప్రతి వా ర్డులో అభివృద్ధి పనులు వేగవం తం చేయనున్నట్లు ఎమ్మెల్యే పే ర్కొన్నారు. పార్టీలకు అతీతంగా అభివృద్ధికి అందరూ సహకరించాలన్నారు. మున్సిపాలిటీలో త్వరలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుతో పాటు ఆర్చిలు, టౌ న్‌హాల్‌ నిర్మాణం కొ రకు స్థలం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర వర్కింగ్‌ ప్రె సిడెంట్‌ కేటీఆర్‌ విడుదల చేసిన రూ.15 కోట్లతో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మిషన్‌ భగీరథ పథకం పనులను పూర్తి చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రతి ఆడబిడ్డ బిందె పట్టుకుని బయటకు రాకూడదనే సంకల్పంతోనే మిషన్‌ భగీరథ పథకం చేపట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇన్‌చార్జి ఏఈ నితీష్‌రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ మ న్సూర్‌, అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, శివ, జమాలుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles