హరిత హారంతో పచ్చదనాన్ని పెంపొందిద్దాం

Sun,June 16, 2019 02:20 AM

-కోటి డబ్బు లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
-ఎవరెవరికి ఎన్నెన్ని మొక్కలు కావాలో నివేదిక ఇవ్వండి
-జూలై రెండో వారంలో హరితహారం ప్రారంభం
-సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ శశాంక
గద్వాల, నమస్తే తెలంగాణ : గద్వాల జిల్లాలో హరితహారం ద్వారా పచ్చదనాన్ని పెంపొదించేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కృతనిశ్చయంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్‌ శశాంక పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశపు మందిరంలో అందరు జిల్లా అధికారులతో హరితహారంపై శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో సుమారు ఆరు లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 0.5శాతం మాత్రమే అటవీ ప్రాంతం ఉండటం అందరికీ ఆందోళన కలిగించే విషయమని కలెక్టర్‌ అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లాను హరితవనంగా మార్చాలనే ఉద్ధేశ్యంతో సకాలంలో వర్షాలు కురువడానికి, భూగర్భజలాలు పెరగడానికి హరితహారం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలకు అనుగుణంగా మొక్కలు నాటుదామని ఆ యన అధికారులకు సూచించారు. గత ఏడాది జిలాల్లో 60లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకోగా 43 లక్షల మొక్కలు నాటామన్నారు. ఈ సంవత్సరం కోటి డబ్బులక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ లక్ష్యానికనుగుణంగా మొక్కలు నాటాల్సిందేనని అధికారులకు కలెక్టర్‌ ఆదేశించారు. రైతులు, పారిశ్రామికవాడలకు ఏ మొక్కలు ఎన్నెన్ని కావాలో వివరాలు వెంటనే నివేదిక రూపంలో సమర్పించాలన్నారు. గత సంవత్సరం కన్నా మూడింతలు లక్ష్యాన్ని ప్రభు త్వం నిర్ధేశించడం జరిగిందని, మొక్కలు నాటిన తర్వా త ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్‌ చేయాలన్నారు. జులై రెండో వారంలో ప్రారంభమయ్యే హరితహారం కోసం అన్ని ఏర్పాట్లు అధికారులు చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. అధికారులు ఇప్పటి నుంచే మొక్కలు నాటే సైట్‌లను గుర్తించి పెట్టుకోవాలన్నారు. గుంతలు తవ్వడం పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

36
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles