రైతు సంక్షేమమే సర్కారు ధ్యేయం

Sun,June 16, 2019 02:19 AM

-అలంపూర్‌ ఎమ్మెల్యే డా. వీఎం. అబ్రహం
-98 శాతంతో జిల్లాలోనే మొదటి స్థానంలో అయిజ
-రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల పంపిణీ
అయిజ : రాష్ట్రంలోని రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని అలంపూర్‌ ఎమ్మెల్యే డా. వీఎం.అబ్రహం అన్నారు. శనివారం పట్టణంలోని రాయల్‌ ఫంక్షన్‌హాల్‌లో మండలంలో ని రైతులకు పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. గత నాలుగున్నర ఏళ్లుగా రైతులను రాజుగా చేయాలనే సంలక్పంతో సీఎం కేసీఆర్‌ బ్యాంకుల ద్వారా తీసుకున్న రూ. లక్షలోపు రుణాలను మాఫీ చేశాడన్నారు. . రైతులకు మద్ధతు ధర కల్పించి ఆదుకోవాలనే ఉ ద్ద్యేశంతో కొనుగోలు కేంద్రాలను అందుబాటులో కి తెచ్చి పండించిన పంటకు మద్ధతు ధర కల్పించినట్లు తెలిపారు. పెట్టుబడుల కోసం ఇతరుల దగ్గర అధిక వడ్డీలకు తెచ్చు కుని పంట నష్టపోగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్‌ రైతులకు నే రుగా పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద ఎకరాకు రెం డు పంటలకు రూ. 10 వేలు రై తు బంధు పెట్టుబడి సాయం సీఎం కేసీఆర్‌ ఇస్తున్నారని పేర్కొన్నారు.

రైతులు ఏదేని ప్రమాదాలు జరిగి మృతి చెందితే కు టుంబాలు రోడ్డున పడకుండా రైతుబీ మా చేసి ఆదుకుంటున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ అని అన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న భూము లు, రికార్డులను ప్రక్షాళన చేయాలనే లక్ష్యంతో సీ ఎం కేసీఆర్‌ భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారని వెల్లడించారు. అయిజ మండలంలో భూరికార్డుల ప్రక్షాళన 98శాతం పూర్తి కావడం గర్వకారణమన్నారు. అయిజ తాసిల్దార్‌ కిషన్‌ సింగ్‌ రెవెన్యూ సిబ్బందితో కలిసి 98 శాతం పూర్తి చేయడంతో కలెక్టర్‌ చేతుల మీదుగా అవార్డును సైతం అందుకోవడం సంతోషకరమన్నారు. త్వరలోనే 2శాతం పూర్తి చేసి రికార్డు సృ ష్టించాలన్నారు. ప్రస్తుతం మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు 1,151 పట్టాదార్‌ పాస్‌ పుస్తకాలు వచ్చాయన్నారు. రైతులు పాస్‌ పుస్తకాలను తీసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుందర్‌రాజు, పీఏసీఎస్‌ అధ్యక్షుడు రాముడు, తాసిల్దార్‌ కిషన్‌ సింగ్‌, ఎంపీడీవో సాయిప్రకాశ్‌, డిప్యూటీ తాసిల్దార్‌ నరేష్‌, ఆర్‌ఐ లక్ష్మిరెడ్డి, ప్రదీప్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles