ప్రజలకు అవగాహన కల్పించాలి

Sun,June 16, 2019 02:19 AM

-సీజనల్‌ వ్యాధుల పట్లఅప్రమత్తం చేయాలి
-కలెక్టర్‌ శశాంక
గద్వాల,నమస్తేతెలంగాణ: ప్రస్తుతం వర్షాకాలం ను దృష్టిలో ఉంచుకుని జిల్లా లో సీజన్‌ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అందుకని వాటి నుంచి ప్రజ లను కాపాడడానికి వారికి అవగాహన కల్పించేందుకు ముందస్తు ప్రచారం చే యాలని అధికారులను కలెక్టర్‌ శశాంక అదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమా వేశపు మందిరంలో లైన్‌ డిపార్ట్‌ మెంట్‌ అధికారులతో ముందస్తు చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచారం చేయించాలన్నారు. నీరు వేడి చేసిన తర్వాత వడపోసి తాగడం, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, నీరు నిలిచిన ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సీజన్‌ వ్యాధులు ఎక్కువగా వసతి గృ హాలు, కేజీవీబీ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. దీని కోసం ముందస్తుగానే పురపాలక సంఘ అధికారులు అన్ని డ్రైన్‌లు శుభ్రం చేయడం, ఎక్కడా నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలన్నారు. మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులను తరచుగా శుభ్రం చేయిం చడం వాటిని శుభ్రం చేసిన తేదీ ట్యాంక్‌పై రాయడం చేయాలన్నారు. ఫాగింగ్‌ చేయించడం కోసం ముందస్తు చర్యలు తీసుకోవా లన్నారు. మెడికల్‌ హెల్త్‌ ద్వారా అన్ని రకాల వ్యాధులకు మందులు ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో అన్ని రకాల సౌ కర్యాలు అందు బాటులో ఉండే విధంగా అధికారులు చూడాలన్నారు. మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూస్‌, పురపాలక అధికారులు మంచినీటి పైపులైన్లు ఎక్కడ లీకేజీలు లేకుండా అన్ని ముందస్తు రిపేర్లు చేయించుకోవాలన్నారు. కలుషితమైన నీరు సరఫరా చేయడానికి వీలు లేదన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీవో జ్యోతి, డీపీవో కృష్ణ, ఇన్‌చార్జి డీఈవో సుశీంద్రరావు, దవాఖాన సూపరిండెంట్‌ విజయ్‌ కుమార్‌, ఆర్‌డబ్ల్యూస్‌ ఈఈ శ్రీధర్‌రెడ్డి, పురపాలక సంఘం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles