సాగుకు సన్నద్ధం

Sat,June 15, 2019 12:57 AM

-1.59 లక్షల ఎకరాల్లో పత్తి సాగు
-56,277 ఎకరాల్లో వరి ..
-1,26,803ఎకరాల్లో వివిధ పంటలు సాగు
-సిద్ధంగా ఎరువులు, విత్తనాలు
-అన్నదాతలకు అండగా రైతుబంధు సాయం
-పొలాలు సిద్ధం చేస్తున్న కర్షకులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: రైతులు పత్తిపై ఆశలు పెంచుకుంటున్నారు. ప్రతి ఏడాది వరుసగా పత్తిపంట సాగును పెంచుతూ వస్తున్నారు. సీడ్‌పత్తి, కమర్షియల్ పత్తికి మార్కెట్‌లో మంచి డిమాండ్ వస్తుండటంతో లాభాలను గడించేందుకు రైతులు ఎక్కువగా పత్తి పంటలను సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో 50శాతానికి పైగా సాగుభూముల్లో కేవలం ఒక్క పత్తిపంట మాత్రమే సాగవుతుంది. ఈ ఏడాది సాగుచేసే 3,63,085 ఎకరాల్లో అత్యధికంగా 1,59,462 ఎకరాల్లో రైతులు పత్తిపంటను సాగు చేస్తున్నారు. పత్తి తర్వాత 56,277 ఎకరాల్లో వరిపంటను సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారు. 1,26,803 ఎకరాల్లో మిగతాపంటలైన జొన్న, మొక్కజొన్న, కందుల, వేరుశనగ, ఆముదం,మిరప, ఉల్లి, సజ్జ వంటి పంటలను సాగు చేస్తున్నారు. మొత్తం సా గుభూమి 3,60,837 ఎకరాలు ఉండగా వీటికి అదనంగా రైతులు వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల ద్వారా సాగునీటిని అందించడం, రైతుబంధు పథకం ద్వారా పంట పెట్టుబడి సహాయాన్ని అందిం చడంతో చాలా వరకు బీడుభూములు సాగులోకి వస్తున్నాయి.

ఆశల సాగు మొదలైంది. గతేడాది ప్రాజెక్టుల పరిధిలో కాల్వల నుంచి నీరు విడు దల కావడం, చెరువులు, బావుల్లో నీరుండటంతో రైతులు భారీగా పంటలు సాగు చేశారు. ఈ సారి కూడా అదే స్థాయిలో పంటలను సాగు చేసేందుకు రైతు లు సిద్ధమవుతున్నారు. జిల్లాలో అధికంగా పత్తి, వరి పంటల సాగు చేస్తుండగా మిరప, వరి, వేరుశనగ, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆముదం, ఉల్లి, వంటి పంటలను సాగుచేస్తున్నారు. గతేడాది ఇదే సీజన్‌లో సాగు చేసిన పంటలతో పోల్చితే... ఈసారి సాగు చేస్తున్న పత్తిపంటల పెరిగింది. పత్తికి మార్కెట్‌లో మంచి ధర పలకం, మద్దతు ధరకంటే ఎక్కవగా చెల్లించడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. సీడ్‌పత్తి ద్వారా అధికంగా లాభాలు గడిస్తుండటంతో ఎక్కువ శాతం భూముల్లో సాగు చేస్తున్నారు. దీంతో సీడ్‌పత్తిసాగులో జోగుళాంబ గద్వాల జిల్లా మొదటి స్థానం లో నిలుస్తుంది. జిల్లాలో పత్తి సాగు చేయడాన్ని దాదాపుగా అన్ని మండ లాల్లో ప్రారంభించారు. అయితే సరిపడా వర్షపాతం నమోదవకముందే రైతులు విత్తనాలు నాటుతున్నారు. కనీసం 2నుంచి 3సెంటీమీటర్ల వర్షం నమోదైన తరు వాతనే విత్తనాలు నాటాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.

1,59,462 ఎకరాల్లో పత్తిసాగు
జిల్లాలో అధికంగా రైతులు పత్తి పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపూతున్నారు. గతేడాది పత్తికి ధర గరిష్ఠంగా క్వింటాళ్ రూ.5వేలకు పైగా రేటు పలకడం, సీడ్‌పత్తికి ఎక్కువగా డిమాండ్ ఉండటంతో రైతులు ఈ సారి పత్తిపంట సాగుచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వ్యవసాయ అధికారులు కేవలం నల్లరేగడి పొలాల్లోనే పత్తి పంటను సాగు చేయాలని సూచిస్తున్నా రైతులు మాత్రం గతేడాది ధరను దృష్టిలో ఉంచుకొని అన్ని పొలాల్లో పత్తి విత్తనాలను విత్తారు. జిల్లాలో మొత్తం 3,60,837 ఎకరాల సాగు భూమి ఉం డగా వీటికి అదనంగా 3,63,085 ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నారు. దీనిలో కేవలం ఒక పత్తి పంట మాత్రమే 50శాతానికి పైగా 1,59, 462 ఎకరాల్లో సాగు చేస్తు న్నారు. ఎకరాకు రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాల చొప్పున దాదాపుగా ఈసారి 3,18,924 పత్తి విత్తన ప్యాకెట్లు రైతులు కొనుగోలు చేసినట్లుగా అధికారులు అంచ నా వేస్తున్నారు. జిల్లాలోని అయిజ, మల్దకల్, మానవపాడు, ఇటిక్యాల మండలాల్లో ఎక్కవగా సీడ్‌పత్తి సాగు చేస్తుండటంతో సీడ్ పత్తి సాగులో జిల్లా మొదటి స్థానంలో నిలుస్తోంది.

1,83,080 ఎకరాల్లో వివిధ పంటలు
పత్తిసాగు తర్వాత జిల్లాలో రెండో స్థానంలో వరి పంట నిలుస్తోంది. జూరాల, నెట్టెంపాడు, తుమ్మి ళ్ల ప్రాజెక్ట్, చెరువుల ఆయకట్టు కింద మొత్తం ఈ ఏడాది 56,277 ఎకరాల్లో రైతులు వరి పంట సాగుచేస్తారని అధికారులు అంచనా వేస్తు న్నారు. ఇక మిగిలిన 1,26,803 ఎకరాల్లో మిరప, వరి, వేరుశనగ, మొక్కజొన్న, కందులు, జొన్న, ఆ ముదం, ఉల్లి పంటలు సాగు చేస్తున్నారు. వీటిలో 290 ఎకరాల్లో జొన్న, 20,487ఎకరాల్లో మొక్కజొన్న, 42,340 ఎకరాల్లో కందులు, 14,292 ఎకరాల్లో వేరుశనగ, 7,392 ఎకరాల్లో ఆముదం, 24,250 ఎకరాల్లో మిరప, 9,077 ఎకరాల్లో ఉల్లి, 8,675 ఎకరాల్లో సజ్జ పంటను సాగుచేయ నున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు.
సిద్ధంగా ఎరువులు, విత్తనాలు
ఈ పంటలకు సరిపడా ఎరువులను సబ్సిడీ ద్వా రా రైతులకు అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం 47000 మెట్రిక్ టన్నుల ఎరువుల అందిస్తున్నారు. యూ రియా 10827.22 మెట్రిక్ టన్నులు, డీఏపీ 11076.69 మెట్రిక్ టన్నులు, సూపర్ 2791. 02 మెట్రిక్ టన్నులు, అమ్మోనియం సల్ఫేట్ 2375.00 మెట్రిక్ టన్నులు, పొటాష్ 7,500 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 12,500 మెట్రిక్ టన్నులు రైతులకు అందజే స్తున్నారు. మొత్తం 7,275 క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలను అ ధికారులు పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. వీటిలో వేరుశనగ 50 క్వింటాళ్లు, వరి 6,057 క్వింటాళ్లు, పెసర్లు 300 క్వింటాళ్లు, కందులు 200 క్వింటా ళ్లు, ఆముదం 250 క్వింటాళ్లు, సన్‌ఫ్లవర్ 50 క్విం టాళ్లు, మొక్కజొన్న 368 క్వింటాళ్ల విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

విత్తన సబ్సిడీ ధరలు
మార్కెట్ లభించే విత్తన రేట్లకు తగ్గించి ప్రభుత్వం సబ్సిడీ ద్వారా విత్తనాలను అందిస్తుంది. మార్కెట్‌లో దుక్కులు సిద్ధం చేసుకున్న రైతులకు క్విం టా వేరుశనగ విత్తనం ధర మార్కెట్లో రూ. 7,600 ఉండగా సబ్సిడీపై ప్రభుత్వం రూ. 4,560కే అందిస్తోంది. అలాగే పప్పుశనగ విత్త నం రూ. 8,680 ఉండగా సబ్సిడీపై ప్రభు త్వం క్వింటాకు రూ.5,815లకే విత్తనం ఇవ్వనున్నారు. కందులు 4బస్తాలు రూ.324 ఉండగా ప్రభుత్వం రూ.162కు అందిస్తుంది. పెసర్లు 4బస్తాలు రూ.392 ఉండగా రూ.196కు అందిస్తున్నారు. వరి (ఎంటీమూ1010) 30 బస్తాలు రూ.870 ఉండగా ప్రభుత్వం రాయితీ ద్వారా రూ.720కి అందిస్తుంది. వరి (బీపీటీ-5204) 30 బస్తాలు రూ.911.40 ఉండగా ప్రభుత్వం రూ.761.40 కు అందిస్తుంది. వేరు శనగ, పప్పు శనగ, మొక్కజొన్న, వరి, మినుములు, పెసర్లు, విత్తనాలు అవసరమైన రైతులు పట్టాదారు పాసు పుస్తకంతో పాటు ఆధార్‌కార్డు జీరాక్స్, ఫోన్ నంబర్ ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

54
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles