ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించండి

Sat,June 15, 2019 12:56 AM

-ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది..
-బడిబయట పిల్లలను బడులకు పంపండి
-అర్హత గల ఉపాధ్యాయులతో భోదన
-ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల మోత
-ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
మల్దకల్ : ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రొ.జయశంకర్ బడిబాటలో భాగంగా మండలంలోని అమరవా యి గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎ మ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథి గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చ దువుకున్న వారిలో చాలామంది దేశంలోని వివిధ రంగాల్లో ఎంతో ప్రావీణ్యం సంపాందించి, మంచి పేరు తెచ్చుకున్న మహనీయులు ఉన్నారన్నారు.

నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులతో భోధన..
ఎంతో నైపుణ్యం ఉన్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ప్రభుత్వం విద్యనందిస్తుందన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ముఖ్యంగా ప్రైవేట్ పాఠశాలల బిల్డింగ్‌లు చూసి మోసపోతారన్నారని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మంచి భోధనతో పాటు ఉచిత పాఠ్య పుస్తకాలు, భోజనాన్ని ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అదేవిధంగా విద్యార్ధులకు యూనిఫామ్ కూడా అందజేస్తుందన్నా రు. ఇన్ని సౌకర్యాలు ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తారా లేక బట్టీ పద్ధతిని అవలంబించే ప్రైవేట్ పాఠశాలల్లో చదివిస్తారో తెల్చుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ఆయన సూచించారు.

మండలానికి ఓ గురుకుల పాఠశాల..
సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల్లో విద్యను మెరుగు పర్చటానికి రాష్ట్రంలో ప్రతి మండలానికి ఓ గురుకుల పాఠశాలను నెలకొల్పి విద్యను అందిస్తుదన్నారు. దీంతో గ్రామల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని, దీని కోసం ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. దీనంతటికి కారణం సీఎం కేసీఆర్ చలవేనన్నారు.

చిన్నారులకు అక్షరాభ్యాసం..
గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు చెందిన చిన్నారులకు ఎమ్మెల్యే అక్షరభ్యాసం చేయించారు.

బడిబాట ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే..
బడిబాట కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అలాగే గ్రామంలోని బస్టాండ్ వరకు విద్యార్ధులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.
ఇటీవల పదోతరగతి పరీక్షల్లో అమరవాయి పాఠశాలకు చెందిన విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణీత సాధించారు. ఇందుకు అహర్నిషలు కృషి చేసిన పాఠశాల జీహెచ్‌ఎం బిఎస్ రవిని శాలువా, పూల మాలతో ఎమ్మెల్యే సన్మానించారు.

కళాజాత ప్రదర్శన..
బడిబాటలో భాగంగా టీఎస్‌ఎస్ కేశవుల ఆధ్వర్ంయలో అమరవాయి పాఠశాలలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యపై గ్రామంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా వారు నృత్యాలు, పాటల ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీలు అలివేలమ్మ, గోపాల్‌రెడ్డి, సర్పంచ్ పద్మమ్మ, జిల్లా సంక్షేమ అధికారి రాములు, జిల్లా విద్యాశాఖ అడ్మినిస్టేటివ్ ఇందిర, బీసీ వెల్ఫేర్ అధికారి ఇందిర, సెక్టోరియల్ అధికారి జగదీశ్‌గౌడ్, జిల్లా సంక్షేమ అధికారి పద్మావతి, సీడీపీవో కమలాదేవి, ధరూర్ ఎంఈవో సురేష్, సూపర్‌వైజర్ నాగరాణి, నాయకులు తూంక్రిష్ణారెడ్డి, తిమ్మారెడ్డి, విద్యార్థులు, వారి తల్లి దండ్రులు, ఎస్‌ఎంసీ చైర్మన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

53
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles