జోగుళాంబ ఆలయంలో చండీహోమం

Sat,June 15, 2019 12:55 AM

-అమ్మవారి ఆలయంలో రథోత్సవం
అలంపూర్, నమస్తే తెలంగాణ : జోగుళాంబ ఆలయంలో శుక్రవారం ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి అర్చకులు వారోత్సవ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. త్రిశతి, ఖడ్గమాల, కుమారి సువాసిని పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు భక్తులకు గాజులు, రవికలు, నిమ్మకాయలు, పూల మాలలు, కుంకుమ తదితర వస్తువులు ఇచ్చి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. మరో వైపు ఆలయంలోని యాగశాలలో ఉదయం సామూహిక చండీహోమం నిర్వహించారు. ఆలయంలో శుక్రవారం సాయంత్రం సంధ్యా సమయాన రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. జోగులాంబదేవి రథాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. శుక్రవారం ప్రత్యేక దినాన్ని పురస్కరించుకుని అలంపూరు ఆలయాలను అనంతపురం జిల్లా విశ్రాంత సీబీఐ అడిషనల్ ఎస్పీ వెంకటరమణ దర్శించుకున్నారు.

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles