సర్కారు బడుల్లోనే ఒత్తిడిలేని విద్య

Sat,June 15, 2019 12:55 AM

-ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా
-బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించడం ప్రతి పౌరుడి బాధ్యత
-జిల్లాస్థాయి బడిబాటను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్, నమస్తే తెలంగాణ : ప్రభుత్వ బడుల్లోనే ఒత్తిడి లేని, నాణ్యమైన విద్య లభిస్తుందని అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం అన్నారు. అలంపూరు మండల పరిధిలోని లింగనవాయి గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ జిల్లాస్థాయి బడిబాట కార్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేకు విద్యార్థులు సాదరంగా స్వాగతం పలికారు. లింగనవాయి ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జీహెచ్‌ఎం వెంకటరంగయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ముందుగా బడిబాట పోస్టర్‌ను విడుదల చేసిన అనంతరం ఎమ్మెల్యే మాటాడుతూ.. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి సమాజంలో ప్రతి ఒక్కరూ విద్యావంతులవ్వాలని సూచించారు. బడిఈడు పిల్లలను బడిలో చేర్పించే విషయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో పాటు ప్రజా ప్రతినిధులు కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం ప్రత్యేకించి బాలికల చదువుకు పెద్దపీఠ వేసిందన్నారు.

విద్యాలయాల్లో కనీస మౌలిక వసతులు కల్పించి, ఉత్తమ ఫలితాలు సాదిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తుందన్నారు. ప్రైవేటు పాఠశాలల నిర్భంద విద్యకు స్వస్తి చెప్పి, ప్రభుత్వ పాఠశాలలకు పంపాలని విద్యార్థుల తల్లిందండ్రులకు ఎమ్మెల్యే సూచించారు. ప్రైవేటు పాఠశాలలు బట్టి కొట్టె విధానాన్ని కొనసాగుతున్నాయన్నారు. దీంతో విద్యార్థి నిత్యం ఒత్తిడికి గురై స్వేచ్ఛను కోల్పోతున్నారన్నారు. ఫిన్‌లాండ్ దేశంలో పిల్లలకు ఏడు సంవత్సరాల వయసు వచ్చే వరకు పాఠశాలలకు పంపరని, మన దేశంలో రెండు సంవత్సరాల వయసు నుంచే పాఠశాలలకు పంపుతున్నామన్నారు. బడిలో చేరిన చిన్నారులకు ఎమ్మెల్యే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. సమావేశంలో తాసిల్దార్ తిరుపతయ్య, సెక్టోరియల్ అధికారి రామకృష్ణ, ఎంఈవోలు అశోక్‌కుమార్ నర్సింహ, శివప్రసాద్, ఎంపీడీవో మల్లికార్జున్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ కావ్య, గ్రామ సర్పంచ్ మనోజ్‌కుమార్‌రెడ్డి, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు తిప్పన్న, పీఆర్టీయూ జిల్లా నాయకుడు వెంకటనాయుడు, ఆపస్ జిల్లా నాయకులు మ ధు, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం బాలాజీ కృష్ణ కుమార్, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిందండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

46
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles