ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి

Sat,June 15, 2019 12:55 AM

గద్వాల, నమస్తే తెలంగాణ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ లో ప్రవేశాలకై పదో తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ వి.వి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు iti.telanagana.gov.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో సంప్రదించాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 9110523925 ను సంప్రదించాలన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles