ముగిసిన క్రికెట్ టోర్నీ

Sat,June 15, 2019 12:55 AM

-విజేతగా నిలిచిన బీరెల్లి జట్టు
-విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల రూరల్ : మండల పరిధిలోని బీరెల్లి గ్రామంలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం ముగిసింది. ఈ టోర్నమెంట్‌కు 48 జట్లు పాల్గొనగా అందులో బీరెల్లి జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతి రూ.40,000 గెలుచుకుంది. రెండో బహుమతి సంకిరెడ్డిపల్లి జట్టు రూ.20,000 గెలుచుకుంది. ఈ టోర్ని ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహాన్‌రెడ్డి హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలు మానవుడికి మానసిక ప్రశాంతతతో పాటు శరీర దృఢత్వాన్ని కలుగజేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని, గ్రామీణ క్రీడాకారులకు తన సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయని అన్నారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమేష్‌నాయుడు, సర్పంచ్ సరోజమ్మ, ఎంపీటీసీ, రాధమ్మ, మాజీ సర్పంచ్ బీసన్న, టీఆర్‌ఎస్ నాయకులు నీలేశ్వర్‌రెడ్డి, పరుశరాము నాయుడు, బీచుపల్లి తదితరులు పాల్గొన్నారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles