ఎస్సీ కార్పొరేషన్ పైలట్ గ్రామంగా వేముల

Sat,June 15, 2019 12:55 AM

ఇటిక్యాల : మం డల పరిధిలోని వే ముల గ్రామాన్ని ఎ స్సీ కార్పొరేషన్ పైలట్ గ్రామంగా ఎంపికైందని ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారంలో గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎస్సీల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ ద్వారా రుణాలు 70 శాతం రాయితీతో మంజూరు చేయబడతాయని పేర్కొన్నారు. అర్హత గల్గిన ఎస్సీలకు బ్యాంకు నుంచి రుణాలు అందజేయబడతాయన్నారు. బ్యాంకు రుణాలు అర్హతకు సంబంధించి 18 సంవత్సరాలు పైబడి 50 సంవ త్సరాలు లోబడి ఉన్న వారు అర్హులన్నారు. వీరు గతంలో ఎక్కడైన కార్పొరేషన్ రుణాలు తీసుకుని బకాయి పడిన వారు ఉన్న వారు అనర్హులన్నారు. రుణాలు పూర్తిగా చెల్లించి ఉంటే మరో సారి రుణం తీసుకొనుటకు అర్హత ఉంటుందన్నారు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించబడు తుందన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ ఏడీ సురేఖ, డాక్టర్ రాజేష్ బాబు, పంచాయతీ సెక్రటరి వెంకటనారాయణ గ్రామస్తులు పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles