భీముడికి కన్నీటి వీడ్కోలు

Fri,June 14, 2019 03:28 AM

-శోకసంద్రంలో మునిగిన గట్టు
-సొంత వ్యవసాయక్షేత్రంలో ఖననం
-ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలివచ్చిన భీముడి మిత్రులు, అభిమానులు
-పాడె మోసిన మంత్రి నిరంజన్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులుగౌడ్
జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/ గట్టు : జనం అశ్రునయనాల మధ్య జోగుళాంబ గద్వాల జిల్లా బలిమెలలో గురువారం గట్టు భీముడి అంతిమయాత్ర సాగింది. భీముడి పార్థివదేహాన్ని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మంత్రి నిరంజన్‌రెడ్డి, బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయులుగౌడ్ అంతిమయాత్ర ప్రారంభం నుంచి ఖనన సంస్కారాలు పూర్తయ్యే వరకు ఉన్నారు. ఈ క్రమంలో పాడెను సైతం మోశారు. భీముడి సతీమణి భువనేశ్వరి, కుమార్తెలు, కుమారులు, సోదరుడు, రాష్ట్ర కన్జ్యూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప రోదించటం పలువురిని కంటతడి పెట్టించింది. తమ ఆత్మీయ నేత లేరన్న నిజాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

జనసంద్రమైన బలిగెర
గట్టు భీముడి అంతిమయాత్ర, అంత్యక్రియలకు భారీ సంఖ్య జనం హాజరయ్యారు. బలిగెరలో ఎటూచూసినా జనం కనిపించారు. తమ ఆత్మీయ నాయకుడిని కడసారిగా చూసేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి ఆయన అభిమానులు, బీసీ సంఘాల నాయకులు, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడ గట్టు భీముడి మిత్రులు, అభిమానులు బలిగేరకు చేరుకుని ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. భీముడితో బాంధవ్యం ఉన్న పలువురు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటిని ఆపుకోలేకపోయారు. భీము మృతి సందర్భంగా గట్టు శోకసంద్రంగా మారింది. అంతిమయాత్ర దారి పొడుగునా గట్టు భీముడు అమ ర్ రహే అన్న నినాదం మిన్నంటింది. ఆయన వ్యవసాయ క్షేత్రంలో గట్టు భీముడి పార్థివ దేహాన్ని ఖననం చేశారు.

నివాళులర్పించిన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బలిగెరకు చేరుకొని గట్టు భీముడి పార్థివదేహంపై పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. శోకసంద్రంలో మునిగిన గట్టు భీముడి భార్య భువనేశ్వరిని, తమ్ముడు గట్టు తిమ్మప్పను కేటీఆర్ ఓదార్చారు. అధైర్యపడొద్దని అన్ని విధాలా అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. అనంతరం మధ్యాహ్నం 12.40కి రోడ్డు మార్గాన గద్వాల వెళ్లారు. జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తలో సమావేశమై.. మధ్యాహ్నం 2.20గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.

అన్నీ తానై చూసుకున్న మాజీ ఎమ్మెల్యే
మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి అంత్యక్రియలకు కొత్తగూడెం మా జీ ఎమ్మెల్యే శ్రీరామభద్రయ్య హాజరయ్యారు. అంతిమయా అంత్యక్రియల క్రతువుల్లో అన్నీ తానై చూసుకున్నాడు. గట్టు భీముడితో తన అనుబంధాన్ని పలువురితో పంచుకున్నారు.

భారీ బందోబస్తు
మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడి అంత్యక్రియల నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీ లక్ష్మీనాయక్ ఆధ్వర్యంలో పోలీసులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టా రు. డీఎస్పీ షాకీర్‌హుస్సేన్ ఎప్పటికప్పుడు పోలీసులకు సూచనలిస్తూ అంతిమయాత్ర సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నా ఇదిలా ఉండగా జిల్లా కలెక్టర్ శశాంక, డీఎస్పీ షాకీర్‌హుస్సేన్‌లు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి గట్టు భీముడి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అంతిమయాత్రలో ఎమ్మెల్యే లు లకా్ష్మరెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్ అబ్ర హం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, జెడ్పీచైర్మెన్ భాస్కర్, నూతనంగా ఎన్నికైన జెడ్పీచైర్‌పర్సన్ సరిత, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారా వు, మా జీ ఎంపీ మంద జగన్నాథం, షాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీటీసీ బాసు శ్యామల, సర్పంచ్ హనుమంతు పాల్గొన్నారు.

భీముడి జ్ఞాపకాలను నెమరువేసుకున్న నాయకులు
నడిగడ్డ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్న బడుగుల నేత గట్టు భీముడి జ్ఞాపకాలను సహచర నేతలు నెమరు వేసుకున్నాకు. గట్టు భీముడి అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు తమతో గట్టు భీముడికి ఉన్న సానిహ్యితాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రవర్తనా శైలి ఆప్యాయంగా పలకరించే మనస్తత్వాన్ని చెప్పుకుంటూ దుఃఖ్ఖాన్ని వెళ్లగక్కారు. 1977లో గ్రామ పట్వారీగా ప్రారంభమైన ఆయన జీవితం రాష్ట్రంలో అత్యంత బలమైన బీసీ నేతగా ఎదిగే వరకు కొనసాగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ సమయంలో ఆ పార్టీలో చేరి ఎన్టీఆర్ ప్రియశిష్యుడిగా పేరుతెచ్చుకున్నారని గుర్తుచేసుకున్నారు. బాసు భీముడిగా ఉన్న పేరును ఆయన సొంత మండలమైన గట్టు పేరుతో గట్టు భీముడిగా మార్చింది ఎన్టీఆరేనని గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఆదేశానుసారు 1990లో గట్టు జడ్పీటీసీగా, 1999లో గద్వాల ఎమ్మెల్యేగా గెలుపొంది రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకున్నారని గుర్తు చేసుకున్నారు. శత్రులకు, బాంబు దాడులకు భయపడని ధైర్యశాలి అని పలువురు పేర్కొన్నారు. 1989లో బలిగెరలోని దిగంబరస్వామి ఆలయ రథోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ఆయనపై బాంబులు వేయటంతో తప్పించుకున్నారు. అదే ఏడాది మిట్టదొడ్డి గ్రామంలో జరిగిన దాడి నుంచి సైతం గట్టు సోదరులు తప్పించుకున్న విషయాలను వారు చర్చించుకున్నారు. దాడులకు ఎదురొడ్డి బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్లినట్టు పలువురు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్బవించి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతున్న సమయంలో రాష్ట్రం 2010 కోసం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారని చర్చించారు. బోయ వాల్మికులను ఎస్టీలుగా గుర్తించాలని చివరి వరకు పోరాడిన బిసి నేతగా ఆయనను ఎప్పటికి మరిచిపోలేమని ఆయన జీవిత చరిత్రను నెమరువేసుకున్నారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles